accused in anuradha, mohan murder case will be punished: AP CM

New twist in anuradha murder case

Chittoor crime news, chittoor mayor, AP CM chandrababu, anuradha, mohan's nephew chintu, three suspects surrendered, chitoor one town police station, Chittoor mayor Anuradha, 144 section, Chittoor mayor Murder, Chittoor Attack, chitoot recky, factionism, rayalaseema factionist murder, Chittoor Mayor Katari Anuradha Brutally Killed, Chittoor Mayor Katari Anuradha Mudder, Kathari Mohan Condition Critical, Chittoor Mayor Katari Anuradha

new twist in anuradha, mohan murder case, sopurces suspect mohan's nephew chintu hand in brutal attack

అనురాధ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్..!

Posted: 11/17/2015 02:30 PM IST
New twist in anuradha murder case

ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న చిత్తూరు నగర మేయర్ అనురాధ హత్యలో కొత్తకోణం వెలుగుచూసింది. అనురాధను ఎవరు హత్య చేశారన్న విషయంలో పలు కథనాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ముందుగా పోలీసులు సైతం ఇది షాక్షన్ హత్యగానే పరిగణించారు. టీడీపీ సినియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో మరోమారు పాక్షన్ పడగ విప్పిందనుకుంటున్న తరుణంలో.. ఈ హత్యోదంతం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

మేయర్ అనురాధ భర్త మోహన్ మేనల్లుడు చింటూనే ఈ హత్యకు పాల్పడ్డాడని వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో మోహన్ అనుచరులు చిత్తూరులో ప్రతి దాడులకు దిగారు. చింటూకు చెందిన ఆఫీసును పెట్రోలు పోసి తగలబెట్టారు. అంతేకాకుండా, ఆఫీసు ముందు ఉన్న రెండు బైక్ లు, ఒక జీపును దగ్ధం చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు మోహన్ కు ముఖ్య అనుచరుడిగా చింటూ ఉండేవాడు. అయితే, ఏదో భూమి వ్యవహారానికి సంబంధించి మోహన్ కు చింటూ దూరమయ్యాడని సమాచారం. ఈ క్రమంలో, మార్కెట్ యార్డుకు సంబంధించిన అంశమై ఇద్దరి మధ్య భేధాబిప్రాయాలు తలెత్తడంతో.. పలుమార్లు రెక్కీ నిర్వహించిన చింటూ అనుచరులు.. ఇవాళ పట్టపగలు అత్యంత కిరాతకంగా అనురాధను హత్య చేశారు.

చిత్తూరులో ఉద్రిక్తత, 144 సెక్షన్ విధింపు

మేయర్ దంపతులపై దాడి జరగడంతో చిత్తూరు నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో నగరంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా.. ముందస్తు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించారు. పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మోహన్ మేనల్లుడు చింటూ ఈ హత్యోందంతం వెనుక వుందని తెలియడంతో.. టీడీపీ కార్యకర్తలు చింటూ ఆఫీసును, ఆయన ముఖ్య అనుచరులపై దాడులకు పాల్పడడంలో పోలీసులు ఈ చర్యలకు పూనుకున్నారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీలో రత్న సంఘటనా స్థలాన్నిపరిశీలించారు. సంఘటనాస్థలంలో దుండగులు వేసుకున్న బురఖాలు, ఓ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించినట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

Also Read : అనురాధ దంపతుల హత్య కేసులో ఇద్దరు లొంగుబాటు.. ఫాక్షన్ హత్యలేనన్న గాలి..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chittoor mayor  Anuradha  Murder  kathari mohan  nephew  144 section  

Other Articles