Russian plane crash investigators say Airbus broke up in midair over desert

Russian plane crash investigators say airbus broke up in midair over desert

Russian plane, Russian plane crash, Egypt, Russian flight missing

The airline that crashed in Egypt’s Sinai desert killing all 224 people onboard broke up in midair at high altitude, according to Russian officials prompting aviation experts to speculate that a sudden mechanical failure or a midair explosion could have been to blame.

ఈ విమానం కూలిందా..?కూల్చారా.?

Posted: 11/02/2015 08:21 AM IST
Russian plane crash investigators say airbus broke up in midair over desert

రష్యా విమానాన్ని తామే కూల్చివేశామని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ చేస్తున్న ప్రకటనపై అనుమానాలు కలుగుతున్నాయి. ఉగ్రవాదులు చెప్తున్నదానికి ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈజిప్ట్, రష్యా అధికారులు స్పష్టంచేస్తున్నారు. శనివారం ఈజిప్ట్‌లోని సినాయ్ ద్వీపకల్పంలో విమానం కూలిపోవడంతో 224 మంది చనిపోయారు. అయితే ఆ రష్యా విమానాన్ని తాము కూల్చివేశామని ఐఎస్ పేర్కొన్న నేపథ్యంలో ఒక వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయింది. విమానాన్ని కూల్చినట్టు ఉగ్రవాదులు చెప్తున్నా.. దానిని ఎప్పుడు, ఎలా కూల్చారన్న సంగతి మాత్రం మిస్టరీగానే ఉంది.

కానీ ఆన్‌లైన్‌లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు విడుదల చేసినట్లు భావిస్తున్న వీడియోలో ఒక విమానం ఆకాశంలో కూలిపోతూ కాసేటికే పేలిపోయి మంటలు రేగినట్టు ఉంది. విమానం షర్మ్ అల్ షేక్‌ నుంచి శనివారం ఉదయం 5.51 గంటలకు టేకాఫ్ తీసుకుంది. 23 నిమిషాలతర్వాత సైప్రస్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. అయితే ఎలాంటి అత్యవసర కాల్స్ రాలేదని అధికారులు అంటున్నారు. షర్మ్ అల్ షేక్ నుంచి టేకాఫ్ తీసుకోవడానికి ముందు విమానం కండిషన్‌ పై పైలట్ తన కుటుంబీకులతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశాడన్న వార్త బయటికి వచ్చింది. రష్యా విమానం కూలిన ఘటన మీద వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి దర్యాప్తు బృందాలు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. రష్యా అత్యవసర పరిస్థితుల శాఖ మంత్రి వ్లదీమిర్ కొగల్యామవియా నేతృత్వంలోని బృందం ఘటనాస్థలానికి చేరుకుని తన పని మొదలుపెట్టింది. ఎయిర్‌బస్ తయారీ దేశమైన ఫ్రాన్స్ నుంచి ఇద్దరు ప్రమాద దర్యాప్తు అధికారులు ఘటనాస్థలానికి బయల్దేరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russian plane  Russian plane crash  Egypt  Russian flight missing  

Other Articles