China amends law to make male rape a crime

China amends law to make male rape a crime

Rape, Men, rape on man, China, China new law on male rape, china new law

The physical assault on men is now a crime after China effected an amendment to the criminal law. Indecent or sexual assault on others, men or women, now carries a minimum sentence of five years in prison. In the former law, the clause "others" meant only "women". The amendment was passed by the top legislature in August, Xinhua news agency reported.

మగవారిని రేప్ చేస్తే శిక్ష తప్పదు

Posted: 11/02/2015 08:20 AM IST
China amends law to make male rape a crime

శీలం ఎవరికైనా ముఖ్యమే. అయితే ఆడవారి శీలానికి ఇచ్చిన విలువ మగవారి శీలానికి ఇవ్వలేదు చైనా న్యాయ సూత్రాలు. ఇకపై మగవారిపై జరిగే అత్యాచారాల విషయంలో కూడా చైనా కోర్టులు తీవ్రంగా ప్రతిస్పందించనున్నాయి. ఆడవారిపైనే కాదు మగవారిపై రేప్ చేసినా, లైంగిక దాడికి ప్రయత్నించినా జైలు శిక్ష తప్పదని చైనా ప్రభుత్వం చట్టంలో సవరణ చేసింది. దేశంలో పురుషులపై లైంగిక దాడులు, వేధింపులు పెరిగిపోతున్నట్టు ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. వీటిని అరికట్టాలని వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని సమీక్షించిన ప్రభుత్వం.. చట్టంలో సవరణ చేసింది.

ఇప్పటివరకు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినవారికి మాత్రమే జైలు శిక్ష విధించేవారు. ఇక, పురుషులపై లైంగిక దాడికి పాల్పడితే అది ఆడవారైనా, మగవారైనా ఐదేండ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని చట్టంలో చైనా సర్కారు పొందుపర్చింది. అత్యాచారాలు అనగానే చాలా వరకు మగవాళ్లు ఆడవాళ్లను మాత్రమే చేస్తారు అనే భావన ఉంది. కానీ మగవాళ్ల మీద కూడా అత్యాచారాలు చాలా వరకు వెలుగులోకి రాకుండా ఉంటున్నాయి. అయితే చైనా ప్రభుత్వం మొదటిసారి మగవారి మీద జరిగే అత్యాచారాల మీద కూడా తీవ్రంగా స్పందించేలా మార్పులు తీసుకువచ్చింది.  చాలా సార్లు మగవారి మీద మగవారే అత్యాచారానికి పాల్పడుతున్న నేపధ్యంలోనే చైనా ఇలాంటి కొత్త మార్పులు తీసుకువచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  Men  rape on man  China  China new law on male rape  china new law  

Other Articles