isis releases chilling video of russia plane crash

Isis claims responsibility for russian plane crash

Islamic State in Iraq and Syria, Russian plane crash, isis, Egypt, plane, russian airliner crash video, russian airliner crash raw video, russian airliner crash, isis, Egypt, sinai peninsula, russian airliner, plane crash

A militant group affiliated with the Islamic State in Iraq and Syria (ISIS) has claimed responsibility for downing a Russian passenger plane that crashed in Egypt

ITEMVIDEOS: రష్యా విమానాన్ని పేల్చింది మేమే..! ఇది ప్రతీకార చర్యే..!

Posted: 11/01/2015 02:47 PM IST
Isis claims responsibility for russian plane crash

యావత్ ప్రపంచంతో పాటు విమానయాన ప్రయాణికులను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిన రష్యా విమానం కప్పకూలిన ఘటనలో సరికోత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విమానాన్ని తామే కూల్చివేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నిన్న ఈజిప్టులోని సినాయ్ ప్రాంతంలో కూలిపోయిన విమానాన్ని తామే కూల్చేశామనడానికి సాక్ష్యంగా ఓ వీడియోను విడుదల చేసింది. సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై రష్యా జరుపుతున్న దాడికి ఇది ప్రతీకారమని స్పష్టం చేసింది. రష్యా విమానం కూలుతుండగా ఆఖరి క్షణాల్లో తీసిన వీడియో ఇదని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఘటనలో విమానంలోని మొత్తం 224మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా, ఇంతకుముందు ఈ విమానం ప్రమాదకర పరిస్థితుల్లో కూలిందని, ఉగ్రదాడి లేదని అటు ఈజిప్ట్, ఇటు రష్యా ప్రభుత్వాలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల వాదనను ఇటు ఈజిప్టు, అటు రష్యా కొట్టిపారేస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనలో ఉగ్రవాద లింకు లేదని స్పష్టం చేశాయి. అయితే, ఆ విమానాన్ని తామే కూల్చామని చెప్తూ.. ఆధారంగా కూలుతున్న దృశ్యాలతో ఓ వీడియో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ విడుదల చేసింది. క్షిపణితో తామే విమానాన్ని కూల్చేశామని ప్రకటించింది. మరోవైపు విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు కీలకమైన బ్లాక్ బాక్స్‌ను దర్యాప్తు అధికారులు నిపుణులకు పంపించారు.

ఎర్రసముద్ర పర్యాటక నగరమైన షర్మెల్ షేక్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయల్దేరిన ఈ విమానంలో ప్రయాణించిన వారిలో అత్యధికులు పర్యాటకులు. రష్యాకు చెందిన వారు.  పర్యాటక ప్రాంతంలో విహరించిన అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన 217 మందిలో 17 మంది బాలలు, 138 మంది మహిళలు ఉన్నారు.ఈ తాజా వీడియోలో గాల్లో వస్తున్న విమానం పేలిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆపై పొగలు కక్కుతూ విమానం కూలడం కనిపిస్తోంది. ఐఎస్ఐఎస్ మూడు గంటల క్రితం విడుదల చేసిన ఆ వీడియోను మీరూ చూడండి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis  Egypt  sinai peninsula  russian airliner  plane crash  

Other Articles