'Selfies at the Border': Tourism Booms Despite Ceasefire Violations by Pakistan

Selfies at the border despite ceasefire violations

'Selfies at the Border', despite ceasefire violations, Border': Tourism Booms, Ceasefire Violations by Pakistan, Tourism, jammu, Ceasefire Violations, india-Pakistan, Border tourism,International Border,RS Pura,Jammu, ceasefire violation

Border tourism is bustling despite record ceasefire violations in the last two years as hundreds are visiting the International Border in RS Pura sector each day.

నిత్య రావణకాష్టం.. తుపాకీ గుళ్ల వర్షం.. అయినా తగ్గని సెల్ఫీల పర్వం..!

Posted: 11/01/2015 01:54 PM IST
Selfies at the border despite ceasefire violations

దాయాధి దేశం పాకిస్థాన్.. భారత్ తో కుదుర్చుకున్న సరిహద్దు కాల్పుల విరమణ ఓప్పందాలను తుంగలో తొక్కుతూ.. నిత్యం రావణ కాష్టంలా సరిహద్దు ప్రాంతాలు, గ్రామాలపై తుపాకీ గుళ్ల వర్షం కురిస్తుండగా, సరిహద్దులోని గ్రామాలను ఖాళీ చేసి సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలసలు వెళ్తున్న నేపథ్యంలో..  ధైర్యం చేసి మరీ ఆ ప్రాంతాలకు వెళ్లి మరీ ఆనందాన్ని పోందుతున్నారు పర్యాటకులు. భారత సరిహద్దులకు వస్తున్న టూరిస్టుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా ఆర్ఎస్ పురా సెక్టారుకు నిత్యమూ వందలాది మంది టూరిస్టులు వచ్చి పోతున్నారు. వీరంతా సరిహద్దుల వద్ద ఫోటోలు తీసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. సైనికులు ఉండే బంకర్లలోకి కూడా వెళ్లి వారితో కలిసి చిత్రాలు తీయించుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతంలో వ్యాపారాలు పెరిగాయి.

ఇక్కడికి రావడం, కనుచూపు మేరలో పాక్ జెండాలు కనిపిస్తుండటం, పక్కనే భారత జెండాలు రెపరెపలాడుతుండటం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఉత్తరాఖండ్ నుంచి టూరిస్టులుగా వచ్చిన షెల్జా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి వున్న బంకర్లు చూడాలన్న తన కోరిక ఇన్నాళ్లకు తీరిందని తెలిపారు. రెండు రోజుల క్రితం తాము తుపాకుల చప్పుళ్లను విన్నామని, ఈ ప్రాంతాన్ని చూడాలన్న కోరికను తీర్చుకునేందుకే వచ్చామని పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి ప్రాంతం నుంచి వచ్చిన కిషన్ లాంబా వివరించారు. వీరిలానే బార్డర్ వద్దకు వచ్చి రెండు రోజులుండి వెళుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో, వీరి భద్రత సైన్యాధికారులకు కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. మరి ఈ తరంలో సెల్ఫీల మోజు ఎంతగా పెరిగిందో అందరికీ తెలిసిందే కదా?!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Selfies at the Border  Tourism  jammu  Ceasefire Violations  india-Pakistan  

Other Articles