Namo bar’s licence stayed for 180 days

Namo bar s licence stayed for 180 days

Modi, Namo, Nagpur, Namo Bar, Namo Bar in Nagpur, Modi fans, BJP

District collector SachinSurve has suspended the licence of Namo bar at Godhni for 180 days on Tuesday after an agitation against the establishment turned violent. The protest had got a political hue with BJP MLA SagarMeghe backing the protesters.

మోదీ పేరుతో బార్... మూసివేయించిన కలెక్టర్

Posted: 10/23/2015 02:00 PM IST
Namo bar s licence stayed for 180 days

పాపులారిటీని క్యాష్ చేసుకోవడంలో ఇండియన్ లను మించిన వారు ఎవరూ లేరు. పాపులర్ హీరోలను, పాపులర్ పొలిటీషియన్స్ ను తమ ఆదాయ వనరుగా మార్చి.. ఎంతో కొంత సొమ్ము చేసుకోవడం మామూలే. అయితే తాజాగా నాగపూర్ లో ఓ బార్ కు ప్రధాని నరేంద్ర మోదీ షార్ట్ కట్ పేరు ‘‘నమో’’ పేరుతో బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం.. దాని మీద వివాదం తలెత్తడం వార్తల్లో నిలిచింది. తమ నాయకుడి పేరు పెట్టుకుని బజారులో పడేస్తారా అంటూ బీజేపీకి చెందిన నాయకులు రోడ్డెక్కారు. తక్షణం బార్‌ ఎత్తివేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మద్యం, మాంసాహారం అమ్మే బార్‌ అండ్‌ రెస్టారెంట్‌-కు ‘నమో’ పేరు పెట్టడం ద్వారా తమ నాయకుడి పేరును అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ నాయకుడి పేరుతో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ తక్షణం దీన్ని మూసి వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తూ నాగపూర్‌ ఎమ్మెల్యే సమీర్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు దండెత్తారు. దీంతో నాగపూర్‌ కలెక్టర్‌ జోక్యం చేసుకుని బార్‌ లైసెన్స్-ను ఆరు నెలలపాటు సస్పెండ్‌ చేశారు. ఆరు నెలల తర్వాత మళ్లీ ఇదే పేరుతో దీనిని తెరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అయితే ‘నమో’ అని పేరు పెట్టుకుంటే లైసెన్స్‌ రద్దు చేస్తారా అంటూ ఆప్‌ నాయకులు కలెక్టర్‌-ను నిలదీశారు. బార్‌ యజమాని మాత్రం మోదీ మీద ఉన్న అభిమానంతోనే ఆ పేరు పెట్టానని చెప్పుకోవడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Namo  Nagpur  Namo Bar  Namo Bar in Nagpur  Modi fans  BJP  

Other Articles