warangal bye election to be held on 21st november

Election shedule issued for warangal parliamentary constituency

warangal bye election, kadiyam srihari, shedule released, kadiyam srihari resigned mp seat, warangal parliamentary constituency, warangal bye election on 21st november, chief election commission of India, election shedule for warangal parliamentary

chief election commission of India issues election shedule for warangal parliamentary constituency, bye election to be held on 21st november

వరంగల్ ఉపఎన్నికకు మోగిన నగరా..!

Posted: 10/21/2015 07:18 PM IST
Election shedule issued for warangal parliamentary constituency

పార్లమెంటు సభ్యుడి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న కడియం శ్రీహరి .. అంతకుముందు గెలుపోందిన వరంగల్ లోక్‌సభా స్థానానికి జరగాల్సిన ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూలు విడుదల చేసింది. దీంతోపాటు మరికొన్ని స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూలును బుధవారం సాయంత్రం విడుదల చేసింది. అయితే, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికకు మాత్రం షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. నవంబర్ 21వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. దీనికి ఈనెల 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కాగా ఎన్నికల ఓట్ల లెక్కింపును 24న చేపట్టనున్నారు.

*    అక్టోబర్ 28 - నోటిఫికేషన్ విడుదల
*    నవంబర్ 4 - నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ
*    నవంబర్ 5- నామినేషన్ల పరిశీలన
*    నవంబర్ 7 - ఉపసంహరణకు తుది గడువు
*    నవంబర్ 21 - ఉప ఎన్నికల పోలింగ్
*    నవంబర్ 24 - ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : warangal bye election  kadiyam srihari  shedule released  

Other Articles