Muslim lady built a temple in Madhyapradesh

Muslim lady built a temple in madhyapradesh

Indra Colony, Mandsaur, Madhya Pradesh, Hindu Temple, Muslim Woman, Religious tolerance, Religious Tolerance in India, Religious Tolerance in Madhya Pradesh

Sughra Bi, a 45-year-old day labourer has been living with her family in Indra Colony of Madhya Pradesh's Mandsaur district for a decade. It was about three years ago the Muslim woman discovered a temple near her house. It was in ruins and no one knew about it.

ITEMVIDEOS: అది ముస్లిం కట్టిన అమ్మవారి గుడి

Posted: 10/13/2015 12:02 PM IST
Muslim lady built a temple in madhyapradesh

అవును.. దేశంలో హిందు, ముస్లింల మధ్యన సాగుతున్నఅనుబంధం నేటిది కాదు. ఎంతో కాలంగా ఇక్కడ హిందువులు, ముస్లింలు అన్నదమ్ముల్లాగా, అక్కా చెల్లెళ్లలాగా ఉంటున్నారు. తాజాగా ఓ వినాయకుడి గుడిలో ముస్లిం యువతికి డెలివరి చేసిన హిందు మహిళల గురించి వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి అలాంటి ఓ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ ముస్లిం మహిళ నిర్మించిన అమ్మవారి గుడి.. ఆ గుడిలో నవరాత్రి ఉత్సవాల మీద జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం ప్రసారమైంది. దాద్రీ లాంటి ఘటనల తర్వాత హిందు, ముస్లింల మధ్య అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు జరుగుతున్నాయి.

మధ్యప్రదేశ్ మాండ్ సూర్ జిల్లా ఇందిరాకాలనీకి చెందిన సుగ్రాబీ అనే మహిళ తన ఇంటి పక్కనే దీనావస్థలో ఉన్న దేవాలయాన్ని నిర్మించాలని అనుకుంది. నిజానికి తాను ఓ ముస్లిం కానీ హిందు మతానికి చెందిన దేవీ ఆలయాన్ని నిర్మించాలని ఆలోచించింది. అంతే తన ఆలోచనను అక్కడ ఉంటున్న మిగిలిన వారికి చెప్పింది. అలా మరికొంత మంది ముస్లింలను కలుపుకొని ఓ కమిటీని ఏర్పాటు చేసుకుంది. ప్రతి ఒక్కరు రెండు రూపాయలు ఇవ్వాలని షరతు పెట్టుకున్నారు. అలా పోగేసిన డబ్బులతో దేవీ ఆలయాన్ని నిర్మించారు. అక్కడే ఉంటున్న ముస్లింలు, హిందువులు కూడా దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో.. దేవాలయంలో పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మతాలు వేరైనా మంచి పని చెయ్యడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు అని సుగ్రాబీ నిరూపించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles