That TDP Mp like Raviteja in Kick cinema

That tdp mp like raviteja in kick cinema

Malla Reddy, MP Malla Reddy,. CMR colleges, Malla Reddy Dance, MallaReddy Gangnam Dance, MallaReddy contraversial statements, MallaReddy about KCR, MallaReddy MP

TDP Mp from malkajgiri is too diffrent from others. He spoke some contraversial comments and statements. He will dance in many fuctions.

ITEMVIDEOS: ఆ టిడిపి ఎంపీ ‘కిక్’లో రవితేజలాంటోడు

Posted: 10/13/2015 01:12 PM IST
That tdp mp like raviteja in kick cinema

తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ.. పార్టీలో ఎవరు ఏం చేసినా కానీ వెంటనే తన స్టైల్లో చర్యలు తీసుకోవడం చంద్రబాబుకు కొత్తగా ఎవరికి చెప్పక్కర్లేదు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎంపీ మాత్రం కిక్ సినిమాలో రవితేజ లాంటోడు. ఎలా అంటారా.. కిక్ కోసం ఆ ఎంపీ ఏమైనా చేస్తారు. కిక్ కోసం ఎంతదూరమైనా వెళతారు అని కూడా అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఎంపీ కానీ కేసీఆర్ ను పొగడ్తల వర్షంలో ముంచెత్తి అందరిని ఆశ్చర్యపరిచారు. పార్టీలో ఉంటారో ఉండరో అని అనుకులా చేస్తారు. కానీ ఆ ఎంపీ లేకుంటే ఎలా అనుకులే చేస్తారె మొత్తానికి ఓ ఎంపీలో సవాలక్ష వేరియేషన్స్ కనిపిస్తాయి. ఊసరవెల్లిలాగా క్షణక్షణానికి ఆ ఎంపీ మారిపోతారు. నేను ఎవరు.? నేను ఎవరు..? మామూలు వ్యక్తిని కాదు.. ఓ ఎంపీని.. అంటూ హూంకరించడం ఆ ఎంపీకే చెల్లింది. స్టూడెంట్స్ తో కలిసి డ్యాన్స్ లు చేస్తారు.. ఎంటర్ టెన్ మెంట్ పంచుతూ ఎంజాయ్ చేస్తారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు అనుకుంటున్నారు. ? మొత్తం స్టోరీ చదవండి మీకే అర్థమవుతుంది.

తెలుగుదేశం పార్టీ తరఫున మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గం నుండి పోటీ చేసి గెలిచిన సి. మల్లారెడ్డి. అవును.. దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజక వర్గం మల్కాజ్ గిరికి ఆయన ఎంపీ. ఇదే విషయాన్ని మామూలుగా చెప్పరు.... నేను మల్లారెడ్డి.. మల్లారెడ్డి... సిఎంఆర్ కాలేజ్ లు ఎవరివి... మల్లారెడ్డి.. మల్కాజ్ గిరి ఎంపీ ఎవరు మల్లా రెడ్డి ఇలా మాటల్లో గర్వం తొనికిసలాడుతుంది. అయినా కానీ ఎక్కడా అలా అప్పుడు మాట్లాడాను అది తప్పేమో అనే భావన ఉండదు. ఎందుకంటే ఆయన మల్లారెడ్డి కాబట్టి.



తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ పార్టీలో డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ అంటే ఏదో ఫార్మాల్టిగా అలా ఓ స్టెప్ వేసినట్లు నటించి వదిలెయ్యడం కాదు... కొత్త కొత్త స్టెప్పులతో విజిల్స్ కొట్టించుకున్నారు. గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ చేస్తూ అందరికి కిక్ తెప్పించారు. మొత్తంగా మల్లారెడ్డి కిక్ కోసం డ్యాన్స్ లు చేస్తారు... అవసరమైతే కాంట్రవర్సియల్ కామెంట్లు చేస్తారు. ఎందుకంటే మల్లారెడ్డికి కావాలి.. కిక్



*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles