Lokayukta issues arrest warrant against Gali Janardhan Reddy

Is gali janardhan reddy absconding

Lokayukta arrest warrant against Gali Janardhan Reddy, Supreme Court, CBI, gali janardhanreddy plea to visit ballari, former minister and mining baron Gali Janardhana Reddy, gali janrdhan reddy missing, gali janrdhan reddy absconding, rumours in karnataka

Former state Minister of Bengaluru and mining baron G Janardhana Reddy is likely to be arrested soon as Bengaluru Lokayukta has reportedly issued arrest warrant against him

లోకాయుక్త అరెస్టు అదేశాలతో.. పరారీలో గాలి జనార్థన్ రెడ్డి..?

Posted: 10/02/2015 02:12 PM IST
Is gali janardhan reddy absconding

పోరుగు రాష్ట్రం కర్ణాటకలో మరో బ్రేకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అక్రమ గనుల తవ్వకాలు, ఖనిజాలా అక్రమ రవాణా కేసులో అభియోగాలు ఎదుర్కంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పోలీసులకు చిక్కడు దోరకుడు సినిమా చూపిస్తున్నారట. అంటే ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారట. గత కొన్నేళ్ల పాటు జైలులో వున్న ఆయన మరోమారు జైలుకు వెళ్లాలంటే ముఖం వాచి.. తప్పించుకు తిరుగుతున్నారని పుకార్లు జోరుగా షికార్లు కోడుతున్నాయి. గాలి జనార్థన్ రెడ్డిని అరెస్టు చేయాలని లోకాయుక్త ఆదేశించడంతో ఆయన కోసం అన్వేషిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందాలకు దొరకకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారన్న వార్తలు చకర్లు కోడుతున్నాయి.

సిట్ బృందాలు రంగంలోకి దిగాయని తెలుసుకున్న గాలి జనార్దన్ రెడ్డి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారని పుకార్లు షికారు చేస్తున్నాయి. మరోవైపు లోకాయుక్త నుంచి గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ కోసం వారెంట్లు పొందిన సిట్ 8 బృందాలను రంగంలోకి దించింది. ఎలాగైనా నేటి సాయంత్రంలోగా గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని భావిస్తున్న సిట్ ఆయన కోసం బళ్లారి సహా బెంగళూరును జల్లెడ పడుతోంది. కాగా, గాలి జనార్దన్ రెడ్డి స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని కూడా వార్తలు అందుతున్నాయి. అయితే గాలి లొంగుబాటును ఎలాగైనా అడ్డుకోవాలని సిట్ యత్నిస్తోంది. మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. ఎవరు విజయం సాధించినా గాలి మరోమారు కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమేనంటున్నాయి న్యాయవర్గాలు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lokayukta  arrest warrant  Gali Janardhan Reddy  absconding  

Other Articles

Today on Telugu Wishesh