Tollywood young Hero creates public nuisance in jubilee hills

Nuisance case against tollywood young hero

Tollywood young Hero Tanish, Hero creates public nuisance, hero tanish public nuisance in jubilee hills, police slaps tanish for public nuisance, jubilee hills police booked public nuisance case against Tanish, hero tanish misbehaved with police in public

the jubilee hills police booked a public nuisance case against Tollywood young Hero Tanish for allegedly misbehaing in public

టాలీవుడ్ కుర్ర హీరోపై పోలీసుల న్యూసెన్స్ కేసు

Posted: 10/02/2015 02:06 PM IST
Nuisance case against tollywood young hero

వెండితెరపై వెలిగిపోయామంటే.. తమకు ఎనలేని రిప్యూటేషన్ వచ్చేసిందని భావించే మన హీరోలు.. ఆ రిఫ్యూటేషన్ ను పబ్లిక్ లో ఎలా కాపాడుకోవాలో కూడా తెలియాలి. అలా కాదని, తామేం చేసినా చెల్లుబాటు అవుతుంది, తమను ఎవరు ఏమీ అడగకూడదు, తాము తమ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం. ఎవరినైనా ఎక్కడైనా ఢీ కోనే రైట్స్ మాకున్నాయి అన్నట్లుగా వ్యవహరిస్తే.. సెలబ్రీటిగా తెచ్చుకున్న పేరు కాస్తా గంగ పాలు అవుతుంది. ఎలా అంటే మన టాలీవుడ్ యంగ్ హీరో తనిష్ మాదిరిగా.

ఖరీదైన కార్లలో రద్దీగా ఉండే హైదరాబాదు రోడ్లపై దూసుకెళుతున్న హీరో తనీష్ ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ ఓ స్కూటరిస్టును ఢికోని.. అతడికి కనీసం సారీ అనే పదం కూడా చెప్పకుండా .. తన తప్పేం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. తుర్రుమన్నాడు. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో తన కారులో వేగంగా దూసుకువచ్చిన తనీశ్ ముందు వెళుతున్న స్కూటరిస్టును ఢీకొట్టాడు. ఆ తర్వాత తన కారును ఆపకుండానే వెళ్లిపోయాడు.

ఈ క్రమంలో బాధితుడు తనీశ్ కారును వెంబడించి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద నిలిపేశాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రంగప్రవేశం చేసిన పోలీసులు తనిశ్ తో పాటు స్కూటరిస్టుపైనా న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. అయితే స్కూటరిస్టును ఢీ కోని పారిపోయిన ఘటనలో మాత్రం పోలీసులు కూడా కేసు నమోదు చేయకుండా ఇలాంటి సర్వసాధరణం అన్న ధోరణిలో వ్యవహరించడంపై కూడా పలు విమర్శలు వినవస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood young Hero  Tanish  Public nuisance  jubliee hills police  

Other Articles