TDP workers revenge on opposition parties for attack on minister and MP

Raghuveera reddy attacked by tdp workers in kona village

raghuveera reddy, AP PCC chief, attack, TDP workers. kona village, kollu Ravindra, konakalla narayana, land acquisition, bandar port

raghuveera reddy attacked by kona village TDP workers as a revenge on minister and MP attack kona village

రఘువీరాకు చేదు అనుభవం.. ప్రతీకారం తీర్చుకున్న టీడీపీ

Posted: 09/13/2015 02:25 PM IST
Raghuveera reddy attacked by tdp workers in kona village

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి ఆదివారం కోన గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న టీడీపీ పార్టీ.. తమ అమాత్యుడితో పాటు పార్లమెంటు సభ్యుడికి జరిగిన పరాభవంపై ప్రతీకారం తీర్చుకునే పనిలో భాగంగా ప్రతిపక్షం అందులోనూ అసెంబ్లీలో ఎలాంటి ప్రాతినిథ్యం లేని పార్టీని రాష్ట్ర అధ్యక్షుడిపై రఘువీరారెడ్డిపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బందరు పోర్టుకు తమ భూములు ఇవ్వమంటూ భీష్మించుకున్న కోన గ్రామస్తులకు మద్దతు తెలిపేందుకు రఘువీరారెడ్డికి ఆదివారం ఆ గ్రామానికి  వెళ్లారు. ఆ క్రమంలో స్థానిక గ్రామస్తులతో సమావేశమయ్యారు.

అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తుల, ఆ పార్టీ సానుభూతి పరులు... రఘువీరారెడ్డిపై ఇసుక, రాళ్లతో దాడి చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి... టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. కాగా క్రితం రోజున బందరు పోర్టు భూములను ఇమ్మించేందుకు ఒప్పిస్తామని ధీమగా వెళ్లిన అమాత్యులు కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణను స్థానికులు గ్రామ శివార్ల వరకు తరమికోట్టారు. ఈ నేపథ్యంలో తమ నేతలకు జరిగిన పరాభావంపై ప్రతీకారం తీర్చుకునే పనిలో భాగంగా స్థానికులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన రఘువీరాపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అయితే తమ పార్టీ  క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటూ నిత్యం అదే డైలాగును వల్లే వేసే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuveera reddy  AP PCC chief  attack  TDP workers. kona village  

Other Articles