after photo revealed by AP police.. telangana police arrested injection psycho

Injection psycho in hyderabad police custody

injection psycho arrested in hyderabad, injection psygho in indiranagar, needle psycho manhandled by public in hyderabad, cctv footage, psycho picture found, injection psycho found in cctv footage, andhrapradesh, injection, psycho, DGP jasti venkata ramudu, bheemavaram, narasapuram, DSP, pulsur bike, two psycho suspects in police handover, twin godavari districts

injection psycho Who challanged AP and Telangana Police and made people of two telugu states people to spent sleepless nights was caught by pulblic and handovered to police

అక్కడ ఫోటోనే దోరకింది.. ఇక్కడ ఏకంగా వాడే దొరికాడహో..

Posted: 09/13/2015 03:08 PM IST
Injection psycho in hyderabad police custody

ఉభయగోదావరి జిల్లాల పోలీసులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఇంజక్షన్ సైకో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పాఠశాల వెళ్లే చిన్నారుల నుంచి పొలం పనులకు వెళ్లే మధ్య వయస్సు మహిళలు వరకు అందరినీ వణికించిన ఇంజక్షన్ సైకో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి.. తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. ఇంజక్షన్‌తో దాడులు చేస్తూ జనాలను బెంబేలెత్తించి.. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా బయటకు వచ్చేందుకు సైతం జంకే పరిస్థితి తీసుకువచ్చిన సైకోను హైదరాబాద్ లోని ఇందిరానగర్ వద్ద స్థానికులు పట్టుకున్నారు.

హైదరాబాద్ ఇందిరానగర్లోని ఓ హోటల్ సమీపంలో సూదీతో ఓ చిన్నారిపై దాడి చేసేందుకు యత్నించిన సైకోను స్థానికులు పట్టుకున్నారు. అనంతరం అతడికి స్థానికులు దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించారు. పోలీసులు సూదిగాడిని అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్కి తరలించారు.  తమదైన శైలిలో సూదిగాడిని విచారిస్తున్నారు పోలీసులు. భీమవరం పోలీసులు ఇంజక్షన్ సైకో ఫోటోగ్రాప్ ను విడుదల చేసిన 24 గంటలలోపే సైకో సూదిగాడిని స్థానికుల సాయంతో హైదరాబద్ పోలీసులు పట్టుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : injection psycho  arrest  hyderabad police  indiranagar  

Other Articles