Chandrababau Naidu proposed to start Anna canteens in AP soon

Chandrababau naidu proposed to start anna canteens in ap soon

Chandrababu Naidu, Anna canteens, Jayalalitha, tamilnadu, Amma canteen, NTR, TDP

Chandrababau Naidu proposed to start Anna canteens in AP soon. In Tamilnadu jayalalitha already implementing Amma canteens, now chandrababu trying to get the populaity.

జయలలితను ఫాలో అవుతున్న చంద్రబాబు నాయుడు

Posted: 09/08/2015 11:07 AM IST
Chandrababau naidu proposed to start anna canteens in ap soon

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురించి దేశంలో ఎవరికి అడిగినా చెబుతారు. ఆ రాష్ట్రంలో ప్రజలకు ఆమె చేసిన సేవలు మరింత కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. అక్కడి ప్రజలు ఎంతో ప్రేమతో అమ్మ అని పిలుస్తారు... తెలుగు నాట కూడా గతంలో ఎన్టీఆర్ కు విశేష ఆదరణ ఉండేది. తెలుగు ప్రజలు ఎంతో ప్రేమతో అన్నా అని పిలిచేంత ఆప్యాయత ఉండేది. కానీ చంద్రబాబు నాయుడుకు ఆ రకమైన ఫాలోయింగ్ మాత్రం లేదు. వరుసగా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఏపికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అది మాత్రం సంపాదించలేకపోతున్నారు. అయితే తాజాగా తమిళనాట జయలలిత స్ట్రాటజీనే చంద్రబాబు నాయుడుకు కూడా ఫాలో కావాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లతో ఏర్పాటు చెయ్యనున్న క్యాంటన్ లు ఎన్టీఆర్ పేరును ప్రజల నోళ్లలో నానడంతో పాటుగా తనకు, తన ప్రభుత్వానికి కూడా మంచి చేస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారు.

జయలలిత కూడా ఎన్టీఆర్ నుండే కాపీ కొట్టింది....
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్కడి ప్రజల కోసం ప్రభుత్వం తరఫున బియ్యం, పప్పులు, నూనెలు, వంట సామాగ్రి, విత్తనాలు, అమ్మ క్యాంటీన్ల పేరుతో చవకగా భోజనం, రెండు రూపాయలకే ఇడ్లీ సాంబార్ ఇలా రకరకాల పథకాలను ప్రవేశపెట్టింది. దాంతో అక్కడి చాలా మంది పేదవాళ్లకు అమ్మగా మారింది. అయితే జయలలిత కంటే ముందే తెలుగు నాట ఎన్టీఆర్ ప్రజా ప్రయోజనాలకు పెద్ద పీట వేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం పెట్టి పేదవాడి కడుపు నింపారు. ఇప్పటికీ రెండు రూపాయలకు కిలో బియ్యం అనగానే ఎన్టీఆర్ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. అలా ఒక్కటే కాదు చాలా పథకాలను ఎన్టీఆర్ ప్రారంభించారు. కార్మిక, కర్షక, రైతు పక్షపాతిగా చరిత్రలో నిలిచారు. అయితే ఇదే ఫార్ములాను జయలలిత కాపీ కొట్టారు. కాకపోతే కొత్త సీసాలో చూపించారు.. తన స్టైల్ లో చూపించారు అంతే తేడా.

పక్కింటి కూర పుల్లన అన్న చందాన చంద్రబాబు నాయుడు గారు తాజాగా అన్న క్యాంటీన్ల ప్రతిపాదన అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ పేరుతో పెడుతున్న పథకాలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెద్ద ప్రాధాన్యత ఇస్తుందా లేదా అన్నది ప్రశ్న. తెలుగు దేశం అంటే ఎన్టీఆర్.. అదే బ్రాండ్ ఇంకా కొనసాగుతోంది.. చంద్రబాబు నాయుడు అయినా ఆ తర్వాత వచ్చే ఎవరైనా కూడా ఎన్టీఆర్ పేరును వాడుకోకుండా ఉండలేరు. కానీ ఇలా అన్నా క్యాంటీన్లను పక్కనున్న అమ్మా క్యాంటీన్ల కాపీ అని మీడియాలో వస్తున్నా కానీ.. కాదు అసలు ప్రారంభించిది మా నాయకుడే అని చెప్పలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీది. ఏది ఏమైనా కానీ జయలలిత లాగా చంద్రబాబు నాయుడుకు అన్నా క్యాంటీన్లు పేరు తీసుకువస్తాయో లేదంటే పరువు తీస్తాయో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Anna canteens  Jayalalitha  tamilnadu  Amma canteen  NTR  TDP  

Other Articles