No Funds | Tirupathi | Pledge

No funds for telangana cm kcr pledge to balaji

KCR, Tirupati , Venkateshwara Swamy, Pledge, Balaji, Telangana, Seperate state, 5 cr for Tirupati

There are no funds in the Common Good Fund of the Telangana state endowments department to fulfil the pledge made by Chief Minister K. Chandrasekhar Rao, offering Rs 5 crore worth of ornaments to the Lord Balaji temple in Tirupati. Though it has been over six months since the TS Cabinet approved the donation in February 2015, the funds have not been released.

తిరుపతి వెంకన్నకే కేసీఆర్ పంగనామాలు

Posted: 09/08/2015 11:08 AM IST
No funds for telangana cm kcr pledge to balaji

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారు. మాట తప్పడం అంటే పోనీలే అని అనుకుంటున్నారేమో మాటిచ్చింది ఎవరికో తెలుసా..? తిరుపతి వెంకన్న స్వామి కి మొక్కులు చెల్లిస్తానని కేసీఆర్ చెప్పినా కానీ ప్రస్తుతం మాత్రం దానికి పంగనామాలు పెట్టేశారు. కరీంనగర్ వేములవాడ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి గతంలో మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్ తిరుపతి వెంకన్నకు మొక్కులు చెల్లించడంలో మాత్రం విఫలమవుతున్నారు. యాదగిరి గుట్ట అభివృద్ది కోసం చేస్తున్న హడావిడి అందరికి తెలిసినా తిరుపతి వెంకన్న మొక్కుల మీద మాత్రం ఎక్కడా చర్చకు రావడం లేదు. అసలు తిరుపతి వెంకన్నకు కేసీఆర్ ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకోండి.

తెలంగాణ ఉద్యమం తారా స్థాయిలో ఉంది.. ఉద్యమం ఎంతో ఉద్రృతంగా సాగుతున్నా.. రాష్ట్రం విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటానని నాటి ఉద్మమ సారధి, ప్రస్తుత తెలంగాణ సిఎం కేసీఆర్ మొక్కులు మొక్కారు. అయితే మొత్తానికి రాష్ట్రం విడిపోయింది.. తెలంగాణ రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైంది. తర్వాత ఎన్నికలు జరిగాయి తిరుగులేని మెజారిటీతో కేసీఆర్ సిఎం కుర్చీలో కూర్చున్నారు. అయితే అంతా ముగిసింది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి తాను మొక్కిన మొక్కులు చెల్లించారు. కానీ అందులో తిరుపతి వెంకన్న స్వామికి చెల్లించాల్సిన మొక్కును మాత్రం గాలికి వదిలేశారు. 5 కోట్ల రూపాయల విలువైన నగలను తిరుపతి స్వామి వారికి చెల్లిస్తానని అందుకు గాను నిధులు కూడా విడుదల చెయ్యాలని చర్యలకు దిగారు కేసీఆర్. కానీ ఫిబ్రవరిలో ఐదు కోట్ల విడుదలకు ప్రతిపాదనలు సిద్దం చేశారు. కానీ అది ప్రతిపాదనల స్టేజ్ లోనే ఉండిపోయింది. తిరుపతి వెంకన్న స్వామికి చెల్లించాల్సిన మొక్కల విషయంలోనే కేసీఆర్ ఇలా నిర్లక్షంగా ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు అని కొంత మంది హెచ్చిరస్తున్నారు. కేసీఆర్ వీలైనంత త్వరగా నిధులు విడుదల చేసి తిరుపతి వెంకన్న ఆశిస్సులు పొందాలని కేసీఆర్ శ్రేయోభిలాషులు కూడా కోరుకుంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Tirupati  Venkateshwara Swamy  Pledge  Balaji  Telangana  Seperate state  5 cr for Tirupati  

Other Articles