Institutions of democracy are under pressure: President Pranab

President pranab wishes india on independence day

President of india, Pranab Mukherjee, Independence Day, President's speech, Independence Day, 69th Independence Day, Pranab Mulherjee, President Pranab Mukherjee, President's speech on Independence Day

President Pranab Mukherjee expressed concern on Friday over Parliament being turned into an “arena of combat rather than debate” as he called upon political leaders and parties for “serious thinking” on corrective measures

ఒత్తిడిలో ప్రజాస్వామ్య వ్యవస్థలు.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

Posted: 08/14/2015 08:36 PM IST
President pranab wishes india on independence day

బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆదర్శాల కోసం కృషి చేయాలని దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  పిలుపు నిచ్చారు. శనివారం 69వ భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతినుద్దేశించి  ప్రసంగించారు. భారతీయులు ఆత్మగౌరవం కోసం స్వాతంత్ర్య ఉద్యమాన్ని చేశారని ఆయన వివరించారు. మనకు పటిష్ఠమైన రాజ్యాంగం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అత్యంత విలువైనదని ఈ సందర్భంగా ప్రణబ్ పేర్కొన్నారు. విలువైన చర్చలకు వేదికగా పార్లమెంట్ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. అలాగే విద్య, ఉద్యోగాలు మహిళలకు అందేలా చట్టాలను మార్చుకున్నామని చెప్పారు.   

ప్రాచీనమైన చట్టాలను రద్దు చేసి మన అవసరాలకు అనుగుణంగా చట్టాలను మార్చుకున్నామని ప్రణబ్ ఈ సందర్భంగా విశదీకరించారు. మానవునికి - ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ప్రణబ్ వివరించారు. తీవ్రవాదులకు మతం, సిద్ధాంతం, భాష అంటూ ఏమీ లేవన్నారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు సహకరించ కూడదని పొరుగు దేశాలు గుర్తించాలన్నారు. ఇటీవల కశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాది నవీద్‌ను పట్టుకున్న పౌరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.భారత్ - బంగ్లాదేశ్లో మధ్య ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదం పరిష్కారమైందన్నారు.

దేశంలోని రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. పదేళ్లుగా దేశ ఆర్థిక ప్రగతి ప్రసంశనీయంగా ఉందని అన్నారు. మనకు పటిష్టమైన రాజ్యాంగం ఉందని ప్రణబ్‌ వ్యాఖ్యానించారు. నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాస్‌ సత్యార్థికి ఆయన అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్య సంస్థలు ఒత్తిడిలో ఉన్నాయని ప్రణబ్ ఈ సందర్భంగా పేర్కోన్నారు. పార్లమెంట్‌ చర్చలకు వేదికగా ఉండాలని, యుద్ధరంగాన్ని తలపించడం మంచిదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. 7.3 శాతం వృద్ధి రేటు సాధించామని ఆయన అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : President of india  Pranab Mukherjee  Independence Day  President's speech  

Other Articles