Venkiah naidu, ap, special status, central govt

Central parliamentary afairs minister venkiah naidu dual wods on ap specail status

central parliamentary afairs minister Venkiah naidu dual wods on ap specail status. Venkiah said that ap dont have the eligibily to get special staus. But with in 24 hours he condemn those statements.

Venkiah naidu, ap, special status, central govt

అబ్బా వెంకయ్యా.. మాట భలే మారుస్తామయ్యా..!

Posted: 05/25/2015 04:04 PM IST
Central parliamentary afairs minister venkiah naidu dual wods on ap specail status

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు మాటలకు అదుపులేకుండా పోయింది. ఓ సారి అవునంటే మరోసారి మాత్రం కాదుకాదు అంటారు. తాజాగా కూడా అదే రిపీట్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒక్క ఆర్థిక లోటు తప్ప ఇతర కారణాలేమీ కనిపించడం లేదని వెంకయ్యానాయుడు తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కావాల్సిన అర్హతలేవీ ఏపీకి లేవన్నారు. ఇప్పటికే దేశంలోని కేరళ, తమిళనాడు వంటి ఏడు రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయని గుర్తు చేశారు. వీటన్నింటికీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే సరైన కారణాలుండాలని వివరించారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తోందని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాపై చర్చిస్తున్నారని, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.  కానీ తాజాగా తన మాటలను మరోలా అర్థం చేసుకున్నారు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.

అసల తాను అలా అనలేదు అని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వడానకి ఏపికి అర్హతలు లేవంటూ వచ్చిన కథనాలు నిజం కాదు అని ఆయన అన్నారు. గాడ్లిల్ ఫార్ములా ప్రకారం ఏపిలేదని మాత్రమే తాను అన్నానని అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా కల్పించడంపై కేంద్ర కేబినెట్ సానుకూలంగా స్పందిస్తుందనే తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏపి ఎదుర్కొంటున్న ఆర్థిక లోటును తాము ఖచ్చితంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు వెంకయ్య. మొత్తానికి రెండు నాలుకల ధోరణి అంటే ఇంతకంటే సూటబుల్ ఉదాహరణ ఉండదేమో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkiah naidu  ap  special status  central govt  

Other Articles