Kcr | Harithaharam | Adilabad | karimnagar

Telugu content

kcr, Adilabad, karimnagar, harithaharam

Telangana cm KCR said that he will rushing by the grace of the people. KCR attend the meeting on the Harithaharam in adilabad.

దూసుకెళ్తా అంటున్న కేసీఆర్

Posted: 07/06/2015 12:30 PM IST
Telugu content

తెలంగాణ ఏర్పాటు తర్వాత మాంచి మూడ్ లో ఉన్న కేసీఆర్ దూకుడు మీదున్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి నుండి తెలంగాణ అన్ని వ్యవహారాల్లోనూ వేగంగా స్పందిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకరంగా ప్రారంభించిన హరితహారంను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జనం ఆశీర్వాదం ఉన్నన్నాళ్లూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతానన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆదిలాబాద్ జిల్లాలో గూడెం ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే కరీంనగర్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు కేసీఆర్.

Also Read:  కేసీఆర్ టార్గెట్ వాళ్ల కొడుకులే

ఆదిలాబాద్ జిల్లా ఆయకట్టు రైతుల కల ఫలించింది. 125 కోట్ల రూపాయలతో దండేపల్లి మండలం... గూడెంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీని ద్వారా దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాల్లో 30 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. తెలంగాణలో మరిన్ని భారీ ప్రాజెక్టులు చేపడతామన్న కేసీఆర్... ఎనిమిదేళ్లలో నీటి వృథాను పూర్తిగా అరికడతామన్నారు. త్వరలో ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్... తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో పర్యటించి, జనం సమస్యలు తెలుసుకుంటానన్నారు.

Also Read:  కేసీఆర్.. బాబుని చూసి నేర్చుకో?

అయితే గత కొంత కాలంగా పక్క పార్టీ నేతలను బాగానే చేర్చుకుంటున్న కేసీఆర్ వలసలను ప్రోత్సహించడంలోనూ మంచి దూకుడు మీదున్నారు. మరి ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా వాటిని అస్సలు పట్టించుకోకుండా దూసుకెళుతున్నారు. అయితే తాజాగా హరితహారం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఓ రైతు మీద అగ్గి మీద గుగ్గిలంగా అయిన కేసీఆర్ దాని మీద మాత్రం మాట్లాడరు మొత్తానికి దూసుకెళ్తానంటున్న కేసీఆర్ కు కళ్లెం వేసేదెవరో మరి...?

Also Read: తెలంగాణ మంత్రివర్గంలోకి కొత్త మొహాలు.. మరి పాత వారి సంగతి.?
Also Read:  హరితహారం అనేది మన ప్రోగ్రాం.. ప్రజల ప్రోగ్రాం అన్న కేసీఆర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  Adilabad  karimnagar  harithaharam  

Other Articles