pavan kalyan to talk about cash for vote case..?

Anxiety over pavan kalyan press meet

anxiety over pavan kalyan press meet, pavan kalyan on cash for vote case, cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, telangana mlc elections, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, horse riding

anxiety surrounds over two telugu states as jana sena president and actor power star pavan kalyan to talk about cash for vote case

పవన్ కల్యాన్ ఏం చెప్పబోతున్నారు..? ఎవరికి హితబోధ చేయనున్నారు..?

Posted: 07/06/2015 11:45 AM IST
Anxiety over pavan kalyan press meet

పవన్ కల్యాన్.. జన సేన అధినేత, పవర్ స్టార్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనం. ఆయన సహాజంగా మీడియాకు అమాడ దూరంలో వుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల మద్య మరోమారు ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులతో అగాధం ఏర్పడుతున్న తరుణంలోనూ తనదైన శైలిలో ఆయన స్పందించారు. దక్షిణాఫ్రికా నల్లసూరీడు నెల్సన్ మండేలా తరహాలో తెలుగు రాష్ట్రాల అభివృద్దికి ముఖ్యమంత్రులు దోహదపడాలని హితబోధ చేశారు. రాజకీయాలు.. ప్రతీకారాలు తీర్చుకునేందుకే అయితే.. దక్షిణాఫ్రికా అభివృద్ది ఎలా సాధ్యమయ్యేదని ఆయన ప్రశ్నించారు. నెల్సన్ మండేలా జాతి వివక్షపై పోరాటం చేయడమే కాదు.. ఆయన ఆ దేశానికి అధ్యక్షుడు అయిన తరువాత వర్ణ వివక్ష లేకుండా పాలన సాగించారని అదే స్పూర్తితో తెలుగు రాష్ట్రాలు ముందుకు సాగాలని సూచించారు.

అయితే రెండు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో పవన్.. తన భావాలను ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారే తప్ప.. మీడియా ముందుకు రాలేదు. అలాంటిది ఇవాళ సాయంత్రం మీడియా ముందుకు వచ్చి ఆయన సమావేశాన్ని నిర్వహిస్తున్నారన్న వార్తతో రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఉత్కంఠ నెలకోంది. ఆయన ఏం మాట్లాడుతారు..? ఎవరిని టార్గెట్ చేస్తారు..? ఆయన ప్రసంగం ఒటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు మాత్రమే పరిమితమా..? లేక పార్టీ వ్యవహారాలపై కూడా చర్చిస్తారా..? అటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతుల భూములపై, ఇటు విజయనగరంలో విమానాశ్రయం వద్దని అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్న క్రమంలో వారి అంశాలను కూడా పవన్ టచ్ చేస్తారా..? ఇంకా ఏ ఏ అంశాలపై పవన్ మాట్లాడతారు..? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pavan kalyan  jenasena  cash on vote  press meet  

Other Articles