Osmania university | Lands | Swagath hotel | Telangana,

Osmania university students attacked on swgath hotel at tarnaka just now

Osmania university, Lands, Swagath hotel, Telangana,

Osmania University students attacked on swgath hotel at tarnaka just now. Osmaina students oppose the telangana govt decision on lands of ou.

ఓయు విద్యార్థుల ఆక్రోశం.. స్వాగత్ హోటల్ పై దాడి

Posted: 05/25/2015 12:18 PM IST
Osmania university students attacked on swgath hotel at tarnaka just now

ఓయు విద్యార్థులు మరోసారి సమర శంకాన్ని పూరించారు. ఇన్నాళ్లు ఉద్యమం అంటే తెలంగాణ కోసం అన్నట్లు సాగిన ఓయు విద్యార్థులు ఇప్పుడు ఇక తెలంగాణ సర్కార్ కు వ్యతిరేకంగా తమ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓయు భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామని.. ఖచ్చితంగా కట్టించి తీరతామని ఖరాఖండిగా వెల్లడించారు తెలంగా ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు ఓయు విద్యార్థులు తమ పోరాటాన్ని తీవ్రం చేశారు. ఓయు పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణం చేశారంటూ తార్నాకలోని స్వాగత్ గ్రాండ్ హోటల్ పై దాడికి పాల్పడ్డారు. విద్యార్థులు ఒక్కసారిగా హోటల్ వైపుకు దూసుకునావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడి చేరుకొని విద్యార్థులను అక్కడి నుండి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఓయు భూముల జోలికి వస్తే ఊరుకోబోము అంటూ విద్యార్థులు కేసీఆర్ ను హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఓయు భూముల మీద రాద్దాంతం చేస్తోంది అంటూ వాళ్లు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభత్వం కావాలనే ఓయు భూములను స్వాధీనం చేసుకోవడానికి ఇలా డ్రామాలాడుతోందని వారు మండిపడుతున్నారు. ఓయు భూముల కబ్జా పై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వెళ్లాయి. కాంగ్రెస్ నాయకులు గవర్నర్ కు, విద్యార్థులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓయు భూముల్లోనే ఇళ్లు నిర్మిస్తామని అంటున్నారు. అయితే విద్యార్థులకు బాసటగా కొన్ని పార్టీ ఇప్పటికే తమ మద్దతు ప్రకటించాయి. అలాగే కోదండరామ్ లాంటి మేధావులు కూడా తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మరి తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Osmania university  Lands  Swagath hotel  Telangana  

Other Articles