rbi | blacklist private finance companies | telangana | 31 finance companies

Rbi blacklisted 31 private finance companies in telangana

private finance companies, RBI, Margadarsi Finance session pvt, rbi, telangana, cid, finance companies, Telangana state, reserve bank of india, black listed finance companies

It is said that RBI blacklisted 31 private finance companies in Telangana state.

తస్మాత్ జాగ్రత్తా.. బ్లాక్ లిస్టు ఫైనాన్స్ జాబితాలో మార్గదర్శి కూడా..!

Posted: 05/19/2015 09:25 PM IST
Rbi blacklisted 31 private finance companies in telangana

తెలంగాణ రాష్ట్రంలోని 31 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలను రద్దు చేస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జాబితాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు కూడా వున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ధినపత్రిక ప్రధాన సంపాదకులు రామోజీరావు వారసులకు చెందిన కంపెనీలు కూడా వుండటంతో అనేక మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రామోజీరావుకు వారసులకు చెందిన మార్గదర్శికి అనుబంధమై రెండు సంస్థలపై భారతీయ రిజర్వు బ్యాంకు బ్లాక్ లిస్టులో పెట్టింది. అయితే వీటితో పాటు మరో 29 ఫైనాన్సుల అనుమతులను ఆర్బీఐ రద్దు చేసింది. నిబంధలను అతిక్రమించి వక్రమార్గంలో ఈ సంస్థలు వ్యాపార లావాదేవీలను కోనసాగిస్తున్నాయి పేర్కోంది.

ఈ ఉత్తర్వులపై సిఐడి స్పందిస్తూ నిషేధిత సంస్థల్లో ఆర్థిక లావాదేవీలు జరపవద్దని ప్రజలకు సూచించింది. అధిక వడ్డీ ఆశచూపి ఈ సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయని, ఈ సంస్థల్లో ఎవరూ డిపాజిట్లు చేయొద్దని సిఐడి కోరింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోనే ఎక్కువగా నిషేధిత సంస్థలు ఉన్నట్లు సిఐడి తెలిపింది. ఆర్‌బిఐ మార్గదర్శకాల మేరకు అనుమతిలేని సంస్థల్లో డబ్బులు మదుపు చేయవద్దని, ఆర్థిక లావాదేవీలు జరపకూడదని ప్రజలను సిఐడి ఓ ప్రకటనలో కోరింది.

ఆర్ బీఐ నిషేధించిన సంస్థలు

ఆర్ బీఐ నిషేధించిన సంస్థలు
1.  మార్గదర్శి ఫైనాన్స్ సెషన్ ప్రైవేటు లిమిటెడ్, సోమాజిగూడ, హైదరాబాద్
2. మార్గదర్శి ఇన్వెస్ట్ మెంట్ అండ్ లీజింగ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్, సోమాజిగూడ, హైదరాబాద్
3. యుక్త ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్, సికింద్రాబాద్
4. ఎమర్జీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్, హకీంపేట, సికింద్రాబాద్
5. శ్రీ హైర్ పర్చేజ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్, సికింద్రబాద్
6. శ్రీ సిరి ఆటో ఫైనాన్షియర్స్  ప్రైవేటు లిమిటెడ్, కొత్తగూడం, ఖమ్మం జిల్లా
7. శ్రీ విష్ణు ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్, హైదరాబాద్
8. హెచ్ సీజీ ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ఇంప్లెక్స్ లిమిలిటెడ్, సైబరాబాద్
9. అవ్యా  ఫైనాన్స్ లిమిటెడ్, సికింద్రాబాద్
10. డీఎస్ఎల్  ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్, హైదరాబాద్
11. బీఎన్ఆర్ ఉద్యోగ్ లిమిటెడ్, హైదరాబాద్
12. నానో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, హైదరాబాద్
13. బాంబినో ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్, సరూర్ నగర్, హైదరాబాద్
14. జీఎన్ వాసవి ఫైనాన్స్ లిమిటెట్, పంజాగుట్ట, హైదరాబాద్
15. శుభం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెట్, బౌద్ధనగర్, సికింద్రాబాద్
16. చెన్నై ఫైనాన్స్ కో లిమిటెడ్, ఆదర్శ నగర్, హైదరాబాద్
17. ఆర్ ఆర్ ఫైనాన్స్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, అమీర్ పేట, హైదరాబాద్
18. మహాలక్ష్మి ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్, రామకోటి, హైదరాబాద్
19. మారుతి సెక్యురిటీస్ లిమిటెడ్, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్
20. ప్రొద్దుటూరు ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్, తాడ్ బంద్, సికింద్రాబాద్
21. మాగ్నిల్ ఫైనాన్స్ అండ్ హైర్ పర్చేజ్ ప్రైవేటు లిమిటెడ్, నల్లకుంట, హైదరాబాద్
22. సూర్యలక్ష్మి సెక్యురిటీస్ లిమిటెడ్, దోమలగూడ, హైదరాబాద్
23. భవ్య కేపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, నారాయణగూడ, హైదరాబాద్
24. సీగల్ లీఫిన్ లిమిటెడ్, కేపీహెచ్ పీ, హైదరాబాద్
25. శ్రీమాన్ సాయి సెక్యురిటీస్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఫైనాన్స్ లిమిటెడ్, జగిత్యాల, కరీంనగర్
26. సెహగల్ లీజింగ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్, రాజభవన్ రోడ్, హైదరాబాద్
27. విక్రాంత్ ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ఇంపెక్స్ లిమిటెడ్, బాలానగర్, హైదరాబాద్
28. సైక్లో ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్, అమీర పేట, హైదరాబాద్
29. నరియన్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్, నారాయణగూడ, హైదరాబాద్

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : private finance companies  RBI  Margadarsi Finance session pvt  

Other Articles