cpi narayana demand case against chandrababu

Ktr and nara lokesh are hitech beggars

CPI Leader Narayana, KTR, Nara Lokesh, Hitech Beggars, Errabelli Dayakar Rao, TJAC, Kodandaram, Telangana CM KCR, Talasani Srinivas Yadav, Thummala Nageswara Rao, Konda Surekha.

CPI Narayana gave sensational comments on KTR and Nara Lokesh for their US and Other countries tours,"They are Hitech Beggars" Narayana exclaimed.

ఇద్దరు ‘చంద్ర’తనయులపై భగ్గుమన్న నారాయణ

Posted: 05/05/2015 11:18 PM IST
Ktr and nara lokesh are hitech beggars

ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. నిత్యం వార్తల్లో వుండే సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ.. గత కొంత కాలంగా రోటిన్ కు భిన్నంగా వున్న ఆయన మళ్లీ తన పాత పంథాను కోనసాగించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తనయులపై భగ్గుమన్నారు. ఎపి ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్, తెలంగాణ ముఖ్యమంత్రి కెటిఆర్ లపై విరుచుకుపడ్డారు.వారిద్దరూ హైక్లాస్ బెగ్గర్స్ మాదిరి విదేశీ యాత్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.వీరిద్దరు విదేశాలలోకి వెళ్లి పెట్టుబడులను సాధించడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతుంటే వారిని నారాయణ హైక్లాస్ బెగ్గర్స్ అని వ్యాఖ్యానించారు. కాగా రైతులకు ఇష్టం లేకుండా భూములు లాక్కుని రాజధాని నిర్మిస్తే అది శ్మశానంపై నిర్మించినట్లే అవుతుందని నారాయణ ధ్వజమెత్తారు.

అనంతపురంలో హత్యలకు ప్రభుత్వ కార్యాలయాలు అడ్డగా మారాయని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకటేశ్వరస్వామి పై ప్రమాణం చేసి ఎన్ కౌంటర్ లో చనిపోయినవారు స్మగ్లర్లు అని చెప్పగలరా అని నారాయణ ప్రశ్నించారు. శేషాచలం ఎన్‌కౌంటర్ ఘటన నేపథ్యంలో చంద్రబాబు పైన కేసు పెట్టాలని సీపీఐ నేత నారాయణ సోమవారం అన్నారు. శేషాచలం ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందిన వారంతా కూలీలే అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్రం, ఇప్పుడు ఏవేవో సాకులు చెబుతోందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సరిగ్గా వ్యవహరించడం లేదన్నారు. భూసేకరణ బిల్లు పైన తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పిన కేంద్రం ఆచరణలో మాత్రం అలా వ్యవహరించడం లేదన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : narayana  lokesh  ktr  

Other Articles

Today on Telugu Wishesh