crpf conistable violent attack on his lover, after she forced him to marry

Crpf jawan cuts off girls hands with blade after love affair

crpf conistable violent attack on lover, love affair, crpf jawan, cuts off girl's hands, chopes lover face, crime in vishaka, mahila sangalu, crime in andhra pradesh,

crpf conistable violent attack on his lover, after she forced him to marry

అమ్మ.. పోలీసు.. అవసరం తీరాక ఇలా వదిలించుకుంటావా..?

Posted: 05/05/2015 11:15 PM IST
Crpf jawan cuts off girls hands with blade after love affair

అందంగా వుందని యువతి వెంట పడ్డాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. అంతా అయిపోయాక.. ఇలా వదిలించుకునే ప్రయత్నం చేసి పరారయ్యాడు. మహిళలపై అరాచకాలను నిరోధించాల్సిన పోలీసే.. ఇలా బాధ్యతారహితంగా, కంచె చేసు మేసిన విధంగా ప్రవర్తించాడు. బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగం చేస్తూ.. అమాయకమైన ఆడపిల్ల వెంటపడి ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీలు ఇచ్చాడు. ఆమెను శారీరకంగా లోబర్చుకుని చివరకు చేతులెత్తేశాడు. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. విశాఖ జిల్లా మాడుగలకు చెందిన ఓ యువతి నర్సు ట్రైనింగ్‌ తీసుకుంటూ విశాఖలోని ఓ ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటోంది. అనకాపల్లి సమీపంలోని తాళ్లపాలెం గొబ్బూరుకు చెందిన కుమార్‌ సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. ప్రేమిస్తున్నానంటూ... ఆ యువతి వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. చివరకు పెళ్లికి పేరెంట్స్‌ ఒప్పుకోవటం లేందటూ ప్లేటు ఫిరాయించాడు.

గత నెల 28న  జమ్మూ నుంచి వచ్చిన కుమార్‌ ఆ యువతిని కలిశాడు. తన ఐడీ కార్డు, మొబైల్ ఫోన్‌ను ఆమె వద్దే ఉంచి, తన గ్రామానికి వెళ్లాడు. ఈనెల 3న విశాఖకు తిరిగి వచ్చాడు. పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదని చెప్పి.. తానిచ్చిన మొబైల్, ఐడీ కార్డు ఇస్తే వెళ్లిపోతానన్నాడు. దీంతో ఖంగుతిన్న ఆయువతి  తన బతుకెలాగని గట్టిగా నిలదీసింది. ఆమె ఎదురుతిరగటంతో జేబులోంచి బ్లేడు తీసి ఆమె ముఖం మీద కోసేయబోయాడు. ఆమె చేతులు అడ్డుపెట్టడంతో చెయ్యి తెగిపోయింది. వెంటనే అతగాడు అక్కడినుంచి పారిపోయాడు. తర్వాత తన అక్క ఇంటికి వెళ్లిన ఆమె, మహిళా సంఘాల సాయంతో పోలీసులను ఆశ్రయించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : love affair  crpf jawan  cuts off girl's hands  

Other Articles