Govt makes contradicting statements on Dawood Ibrahim's whereabouts

Finding dawood ibrahim what prompted the home ministry feign ignorance

dawood ibrahim, home ministry, parliament, mumbai blasts, underworld don, pakistan, neeraj kumar, afganistan, intelligence bureau, contradicting statements, Dawood Ibrahim's whereabouts

The government of India made contradicting statements on Tuesday on the whereabouts of underworld don Dawood Ibrahim

దావూద్ జాడ తెలియదన్న కేంద్రం.. విమర్శలు గుప్పించిన విపక్షాలు

Posted: 05/05/2015 11:20 PM IST
Finding dawood ibrahim what prompted the home ministry feign ignorance

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడో తెలియదంటూ కేంద్ హోంమంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. కాగా కేంద్ర హోం మంత్రిత్వ వాఖ్యలపై ముంబై మాజీ పోలీసు కమిషనర్ ఎంఎన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన ప్రకటనను పెద్ద తప్పుగా ఆయన వర్ణించారు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ రక్షణలో దావూద్ ఉన్నాడని మన నిఘా సంస్థలు నెత్తినోరు కొట్టుకుంటుంటే, అతడి ఆచూకీ గురించి తెలియదని కేంద్రం ప్రకటన చేయడం పెద్ద తప్పు అని పేర్కొన్నారు. దావూద్ ను ఐఎస్ఐ మట్టుబెట్టే అవకాశం లేకపోలేదన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐఎస్ఐ ప్రత్యక్ష పర్యవేక్షణలో పాకిస్థాన్ లోనే దావూద్ తలదాచుకున్నాడని ఎంఎన్ సింగ్ స్పష్టం చేశారు.

కాగా, దావూద్‌ ఇబ్రహీం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో వివరాలేమీ తమకు తెలియదని మంగళవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకుగాను హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హరీభాయి పరాటీభాయి చౌదరి ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దావూద్‌పై యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ నుంచి సైతం తమకు నోటీసులు అందాయని తెలిపారు. 1993 ముంబయి వరుస పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న అతని కోసం రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరీభాయ్ తెలిపారు. ఇప్పటి వరకు దావూద్ జాడ కనుగొనలేదని స్పష్టం చేశారు. దావూద్‌ను పట్టుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, అయితే ఇందుకు పాకిస్థాన్ నుంచి సరైన సహకారం అందడం లేదని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dawood ibrahim  home ministry  parliament  

Other Articles