Strike against Road Safety and Transport Bill tomorrow

Transport unions call for 24 hour nation wide strike tomorrow

strike tomorrow, BMTC buses on Saturday, bangalore bandh, nationwide motor strike on thursday, Nationwide strike, Karnataka Bandh, strike tomorrow in bangalore, bandh on 30 april, strike on april 30, public transports strike, Road Transport and Safety Bill 2014,

Opposing the Centre’s move to pass the ‘Road Safety and Transport Bill, 2014’, trade unions affiliated to the Communist Party of India (Marxist) have announced suspension of operation of buses, lorries and autorickshaws in the district as part of the nation-wide strike on Thursday

ప్రత్యేకం: ఎందుకిలా రవాణా భద్రతా బిల్లును వ్యతిరేకిస్తున్నారు..? సమ్మె దేనికి..?

Posted: 04/29/2015 07:23 PM IST
Transport unions call for 24 hour nation wide strike tomorrow

పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన రోడ్డు రవాణా భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా గురువారం దేశ వ్యాప్తంగా రవాణా రంగ సంస్థలు సమ్మెకు పిలుపునిచ్చాయి. రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని, ఏడాదికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలని, జీడీపి ఏడాదికి 4 శాతం పెంచాలన్నది బిల్లు లక్ష్యాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే బిల్లువల్ల కార్పోరేట్ సంస్థలు, వ్యక్తులకే మేలు జరుగుతుందని రవాణా రంగంలోని పలువురు వాదిస్తున్నారు. దీంతో ేపు పబ్లిక్‌, ప్రయివేట్‌ రంగంలో రోడ్డు రవాణా సమ్మెకు సిఐటియు, ఎఐటియుసి, బియంస్‌, ఐఎన్‌టియుసి, హెచ్‌యంఎస్‌ అనుబంధ ఫెడరేషన్లు, స్వతంత్ర సంఘాలు పిలుపునిచ్చాయి. రోడ్డు రవాణా భద్రత బిల్లు 2015ను రద్దు చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.

బిల్లు లక్ష్యాలు


* రోడ్డు ప్రమాద మరణాలు సంవత్సరానికి రెండు లక్షల చొప్పున తగ్గించడం
* ఏడాదికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించడం
* జిడిపి ఏడాదికి 4 శాతం వృద్ధి సాధించడం

ఇంత అద్భుత లక్ష్యాలతో తెస్తున్న ఈ బిల్లును ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. మద్దతు నివ్వాల్సిందే. అయినా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌ పోర్టు కాంగ్రెస్‌, క్యాబ్‌ ఆపరేటర్లు, ఆర్‌టిసి యాజమాన్యాలు, ప్రభుత్వ రవాణా శాఖ సిబ్బంది, అధికారులు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. సమూలంగా మార్పులు చెయ్యాలని కోరుతున్నారు ఎందుకని?

బిల్లులో ఏముంది?

* ప్రస్తుత మోటారు వాహన చట్టం ప్రకారం ఆర్‌టిసిలకు వున్న ప్రత్యేక సదుపాయాలు బిల్లుతో రద్దు.

* జాతీయం చెయ్యబడిన రూట్లతో ఆర్‌టిసిలకు మాత్రమే వున్న పర్మిట్లు రద్దు.

* బిల్లుతో ఇక రూట్లన్నీ వేలం పాటలో పాడాల్సిందే.

* ఆర్‌టిసిలు కూడా ప్రయివేటు ఆపరేట్లతో పాటు టెండర్లలో పాల్గొనాలి.

* టెండర్లు సాధించుకున్నవారు మాత్రమే ఐదు సంవత్సరాలు ఆ రూట్‌లోనే బస్సులు నడపాలి.

* ఫలితంగా ఆర్‌టిసి వ్యవస్థ కనుమరుగై ప్రైవేటు రవాణా రాజ్యమేలుతుంది

* ఆదాయాలొచ్చే రూట్లన్నీ ప్రయివేట్‌ వారికి దక్కుతాయి.

* ఆదాయం రాని మార్గాలకు ఆర్‌టిసిలు పరిమితమవుతాయి.

* రోడ్డు రవాణా, మోటారు వాహన పన్నులు రాష్ట్రాల పరిధిలోంచి కేంద్రం చేతిలోకి.

* రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి.

* వాహనాల రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌‌, లైసెన్సులు, తదితర పనులన్నీ ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగింత

* ప్రమాదపుటంచుల్లో రవాణా శాఖ ఉద్యోగుల భవిష్యత్‌

* కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలే రోడ్లపైకి.. పాతవాటికి చెల్లుచీటి

* వాహనాల విడి భాగాలు కూడా ప్రభుత్వం అనుమతించిన బ్రాండెడ్‌ కంపెనీలవి మాత్రమే వాడాలి.

* వాహనాల మెయిన్‌టెవెన్స్‌ ఖర్చు తడిసి మోపెడవుతుంది.

* విడి భాగాలు తయారు చేసే చిన్న పరిశ్రమలు మూతబడతాయి.

* చిన్న చితక మెకానికల్‌ షాపులు, మెకానిక్‌లు వీధి పాలవుతారు.

* ఫలితంగా లక్షల సంఖ్యలో స్వయంఉపాధులు బ్రతుకుతెరువు కోల్పోతారు.

* బడా బడా కంపెనీలకు లాభం చేసేందుకు నూతన రవాణ భద్రతా బిల్లు

* భారీగా పెరగనున్న జరిమానాలు, శిక్షలు

* సిగల్‌ జంప్‌ లాంటి చిన్న చిన్న పొరపాట్లకు కూడా వెయ్యి నుంచి రూ.50 వేల దాకా జరిమానాలు

* జరిమానాతో పాటు వారం రోజుల నుంచి ఆరు నెలల దాకా వాహనాలను సీజ్‌

* డ్రైవింగ్‌ లైసెన్సు కార్డ్‌లోనూ, వాహన రిజిస్ట్రేషన్‌ కార్డ్‌లోనూ నెగెటివ్‌ పాయింట్లు నమోదు

* 12 పాయింట్లు నమోదు అయితే లైసెన్స్‌ సస్పెండ్‌, ఏడాది తర్వాత పునరుద్ధరణ

* తదుపరి మరో 12 పాయింట్లు నమోదైతే శాశ్వతంగా లైసెన్సు రద్దు.

ఈ నేపథ్యంలో గురువారం చేపట్టే సమ్మెకు తెలుగు రాష్ట్రాల్లోని కార్మిక సంఘాలైన లారీలు, ట్యాక్సీ, ఆటో సంఘాలు మద్దతు తెలిపాయి. వాటితోపాటు ఈ సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కూడా మద్దతు తెలిపింది. ఈ సమ్మె కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా రవాణా స్తంభించే అవకాశం ఉంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Road Transport and Safety Bill 2014  nation wide strike  transport unions  

Other Articles