mother in law harassed daughter in law, forced her for prostitution for additional dowry

Constable arrested for attempting rape in srikalahasti

constable arrested for attempting rape in srikalahasti, mother in law for harassed daughter in law, crime against woman, violence against women, conistable rape attempt, conistable molests woman, chittoor, srikalahasti, daughter in laws, aunt, prostitution

mother in law sexually harassed daughter in law and forced her to do prostitution for additional dowry in srikalahasti chittoor district.

కటకటాల పాలైన కానిస్టేబుల్.. వ్యభిచారం చేయమని ప్రోత్సహించిన అత్త

Posted: 04/22/2015 10:18 PM IST
Constable arrested for attempting rape in srikalahasti

కన్న కోడుకు మంచాన పడితే.. వాడి ఆలన పాలన చూడాల్సిన తల్లి అత్యంత దారుణంగా వ్యవహరించింది. తన కొడుకు సంపాదన లేదని, తన కోడలి చేత వ్యభిచారం చేయించడానికి యత్నించి కటకటాలు లెక్కించింది. తన కొడలు పెళ్లి లో చప్పినంత కట్నం తేలేదని, అందుచేతే వ్యభిచారం చేయాలని ఒత్తడి చేసినట్టు మరీ బరితెగించి చెప్పింది. కొడలిపై ఓ కానిస్టేబుల్ మనసస్సు పడితే తన ఇంటినే వ్యభిచారం కోంపగా మార్చేందుక కూడా సిద్దమైంది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కట్నం తక్కువగా ఇచ్చారనే కారణంతో కోడలిపై నిత్యం సూటిపోటి మాటలను అంటూ వేధిస్తున్న అత్త.. 13రోజుల క్రితం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ను ఇంటికి తీసుకుని వచ్చింది. డబ్బు వస్తుందనే ఉద్దేశంతో అతని కోరిక తీర్చాలని కోడలిపై ఒత్తిడి తెచ్చింది. అందుకు నిరాకరించిన కోడలు.. కానిస్టేబుల్ ను దూషించడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు అతడ్ని ఇంటికి తీసుకొచ్చిన అత్త, అతడ్ని ఇంట్లోకి పంపించి బయటికి తాళం వేసింది. అప్పుడు కూడా అతని బారి నుంచి బాధితురాలు తప్పించుకుంది. ఆ తర్వాత రెండు రోజులకు ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని లేదంటే తన కొడుకును చంపేస్తానని బాధితురాలిని బెదిరింపులకు గురిచేశాడు.

ఈ క్రమంలో ఈ నెల 11న బాధితురాలి కొడుకుకు రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పిందని.. అతడిని ఆస్పత్రిలో చేర్పించామని, వెంటనే రావాలని సమాచారం అందించడంతో.. అత్తతో కలసి బయలుదేరింది. అయితే అస్పత్రికి బదులు లాడ్జీకి తీసుకెళ్లడంతో అత్తతో గోడవ పడిన కోడలు వెనుదిరుగుతుండగా, అప్పటికే అక్కడ మకాం వేసిన కానిస్టేబుల్ తన గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. వెంటనే తేరుకున్న బాధితులరాలు  కానిస్టేబుల్ బారి నుంచి మరోసారి తప్పించుకుని, నేరుగా తన పుట్టింటికి వెళ్లింది. కుటుంబసభ్యులకు జరిగిన విషయం చెప్పి, తన తల్లి, సోదరుడి సాయంతో ఆమె డిఎస్పీకి ఫిర్యాదు చేసింది. డిఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవాళ అమె అత్తను, అత్యాచారానికి యత్నించిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chittoor  srikalahasti  daughter in laws  aunt  prostitution  

Other Articles