Get General Railway Tickets on App| Railways app for general ticket| Go Green"

Good news you can buy general railway tickets online

General ticket on UTS app, General railway ticket online, Unreserved railway ticket, UTS mobile app, IRCTC e-wallet, Railway booking, Good News: You can buy General Railway Tickets online, General Railway Tickets on App, Railways app for general ticket, railways with go green concept

Railway commuters can get the unreserved or general tickets online through an app called UTS from tomorrow. No queues from tomorrow

రైలు ప్రయాణికులకు శుభవార్త.. అన్ రిజర్డ్వ్ టిక్కెట్లకూ యాప్

Posted: 04/22/2015 10:16 PM IST
Good news you can buy general railway tickets online

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇకపై గంటల కోద్ది సమాయాన్ని టిక్కెట్ కోసం పెద్ద క్యూ లలో నిలబడి.. తంటాలు పడాల్సిన పనిలేదు. అది మాకు తెలుసు.. కానీ అవన్నీ రిజర్వేషన్ పోందే టిక్కట్లకే కదా అంటున్నారా..? అయితే మీరు పోరబడినట్లే.. ఇకపై రిజర్వేషన్ లేని కేటగిరీ టికెట్లను కూడా మీ మొబైల్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే వెసులబాటును కేంద్ర రైల్వేశాఖ తీసుకోచ్చింది. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ టికెట్లను పొందేందుకు రైల్వే శాఖ సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను బుధవారం ప్రారంభించింది. ఇక దీంతో మీరు ఎక్కాల్సిన రైలు పట్టుకున్నాక ట్రైన్ లో కూర్చున్న తరువాతైనా మీ టిక్కెట్టును మీ మొబైల్ నుంచి పోందవచ్చు.

ముంబైలోని సబర్బన్ రైల్వే సెక్టారులో పైలెట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదగా ప్రారంభించారు. ఈ యాప్‌తో అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్ కోసం ప్రయాణికులు ఇక గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా ముందుగా టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే అప్పటికప్పుడు ప్రయాణాలకు సిద్ధమైన ప్రయాణీకులు ఈ కొత్త మొబైల్ యాప్ ద్వారా సులభంగా టిక్కెట్లను పొందవచ్చు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాగిత రహిత టికెట్ సదుపాయం కోసం ఈ అప్లికేషన్‌ను రూపొందించినట్లు రైల్వే శాఖ అధికాలు తెలిపారు. రైలులో ఎక్కిన తర్వాత టీసీలకు మొబైల్‌లోని ఐడీ నెంబర్ చూసిప్తే సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి రైల్వే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రైల్వే ఇ-వాలెట్ కోసం వినియోగదారుడికి రిజిస్ట్రేషన్ ఐడీ నంబరు వస్తుంది. వినియోగదారుడు రిజిస్ట్రేషన్ చేయించుకొన్న తర్వాత వారి వివరాలు ఇ-వ్యాలెట్‌లో నమోదవుతాయి. టికెట్ల కొనుగోలు సొమ్మును ఇ-వాలెట్ మొబైల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఇక జర్నీ హ్యాపీ కదండీ..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Railway apps UTS app Railway general ticket booking  

Other Articles