Heritage | Attacks | Chandrababu | Tamilnadu | AP

On chittur encounter tamil protests fire on babu and heritage in tamil nadu

heritage, tamilnadu, attacks, ap, chandrababu, protests, court

On chittur encounter tamil protests fire on babu and heritage in tamil nadu. The Heritage Fresh supermarket at Mylapore was ransacked on Thursday by two men, allegedly in retaliation to the encounter killings of 20 men from Tamil Nadu by Andhra Pradesh

ఎన్ కౌంటర్ పై రగులుతున్న అగ్గి . హెరిటేజ్ పై దాడి.. చంద్రబాబు దిష్టి బొమ్మల దహనం

Posted: 04/09/2015 03:43 PM IST
On chittur encounter tamil protests fire on babu and heritage in tamil nadu

చిత్తూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ పై తమిళనాట తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్ కౌంటర్ వ్యవహారం గంటగంటకు కొత్త మలుపులు తిరుగుతోంది.
మృతదేహాలకు మరోసారి పోస్ట్మార్టం నిర్వహించాలని మృతుల కుటుంబీకులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ చేయాలని హైకోర్టు న్యాయమూర్తిని కోరారు. అందుకు సమ్మతించిన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్ల మృతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో తమిళనాడు డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.   

అయితే తమ వారి మృతికి కారణమైన ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తమిళనాడులో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఫోటోలను చెప్పులతో కొట్టడం, చంద్రబాబు దిష్టి బొమ్మలను దహనం చెయ్యడం లాంటివి తమిళనాడులో చాలా చోట్ల చొటుచేసుకున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థపై తమిళ సంఘాలు దాడి చేశాయి. తమిళనాడు రాష్ట్రం మహిళాపూర్ శివారు ప్రాంతంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. హెరిటేజ్ వస్తువులు ఎవరు కొనుగోలు చేయవద్దంటూ నినాదాలు చేశారు. మొత్తానికి ఏపి ఎన్ కౌంటర్ కీలక మలుపులు తిరుగుతోంది. ఓ పక్క కోర్టులకు వెళుతూనే.. మరో పక్క తమ నిరసను తెలుపుతున్నారు తమిళులు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heritage  tamilnadu  attacks  ap  chandrababu  protests  court  

Other Articles