Satyam | CBI | Court | Accuse

Court clear that ramalinga raju and other accuses are gulty

satyam, ramalngaraju, scam, court, cbi, probe, accuse

court clear that ramalinga raju and other accuses are gulty. The satyam scam ramalinga raju scam 7 thousad crores. The case is one top scams in India. ramalingaraju, suryanarayan and others will be presioned.

'సత్యం'రామలింగరాజును దోషిగా తేల్చిన కోర్ట్.. శిక్ష ఖరారు

Posted: 04/09/2015 10:58 AM IST
Court clear that ramalinga raju and other accuses are gulty

సత్యం రామలింగ రాజును దోషిగా తేల్చింది సిబిఐ ప్రత్యేక కోర్టు. ఎంతో కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న సత్యం కుంభకోణంలో సిబిఐ కోర్టు తన తుది తీర్పును వెల్లడించింది. సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగ రాజుకు శిక్ష ఖరారు చేసింది.ఈ కేసులో పది మందిని దోషులుగా సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు నిచ్చింది.  సంచలనం సృష్టించిన 'సత్యం' కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో తీర్పు గత మూడు నెలలుగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఏప్రిల్ 9న తుది తీర్పు ఉండగలదని ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి గతంలో వెల్లడించారు. 2009 జనవర్ 7న సత్యం కంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. 7 వేల కోట్ల కుంభకోణంలో మొత్తం 216 మంది సాక్షులను విచారించారు. 33 నెలల పాటు జైలులో ఉన్న ప్రధాన నిందితుడు రామలింగ రాజు సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిలుపై బయటకు వచ్చారు.

స్యతం రామలింగ రాజు  సోదరుడు, సత్యం మాజీ ఎండీ రామరాజు, మరో సోదరుడు బీ సూర్య నారాయణ రాజు మాజీ సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్, పీడబ్ల్యూసీ ఆడిటర్లు గోపాలకృష్ణన్, టీ శ్రీనివాస్, జీ రామకృష్ణ, డీ వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలం,ఆడిటర్ వీఎస్ ప్రభాకర్ గుప్తా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే రాజుతో పాటు పది మంది నిందితులు బెయిలుపై బయటే ఉన్నారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది. దర్యాప్తులో భాగంగా 3000 డాక్యుమెంట్లను కోర్టు పరిశీలించింది. విచారణ ఆరేళ్ల పాటు సాగింది. 2009 ఫిబ్రవరిలో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ 2009 ఏప్రిల్ 7, నవంబర్ 24, 2010 జనవరి7 తేదీలలో మూడు చార్జిషీట్లను దాఖలు చేసింది. అయితే వాటిని ఆ తర్వాత ఒకే చార్జిషీటుగా పరిగణించారు. మరోవైపు మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎన్ ఫోర్స్ మెంట్ డెరెక్టరేట్ కూడా కేసు దాఖలు చేసింది. అయితే కోర్టు సత్యం కుంభకోణంలో ఎలాంటి శిక్ష విధిస్తుంది, ఎంత కాలం శిక్ష వేస్తుంది అన్న విషయాలు కాసేపట్లో తేలుతాయి.

 

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : satyam  ramalngaraju  scam  court  cbi  probe  accuse  

Other Articles