police searches on for another suspect

Police comb nalgonda another suspect moving towards warangal

police comb nalgonda, another suspect moving towards warangal, police searches on for another suspect, nalgonda nazeeruddin baba durga, simi terrorist encounter, simi terrorist shot dead,

police combing places in nalgonda, nazeeruddin baba durga and surrounding where alleged simi terrorist took shelter before encounter. police got information that another suspect moving towards warangal

వరంగల్ వైపు వెళ్లిన మరో అనుమానితుడు.. కొనసాగుతున్న వేట..

Posted: 04/05/2015 11:58 AM IST
Police comb nalgonda another suspect moving towards warangal

నల్గొండ జిల్లాలో సెమీ ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. అర్వపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న సీతారాంపురంలోని ఖాజా నసీరుద్దీన్‌బాబా దర్గాలో ఆశ్రయం పొందిన ముష్కరులకు ఎవరు సహకరించారన్న కోణంలో విచారణ నిర్వహిస్తున్నారు. దర్గాలో విధులు నిర్వహించే మౌలానా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ముష్కరులు తమ వెంట తెచ్చుకున్న ల్యాప్‌టాప్, మరికొంత విలువైన సమాచారాన్ని దర్గా పరిసరాల్లో ఉన్న గుట్టల్లో దాచిపెట్టారని అనుమానిస్తున్న పోలీసులు ఆదిశగా అన్వేషిస్తున్నారు. దర్గా పరిసరాలను పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమైనప్పటికీ మరో ముష్కరుడు ఈ పరిసర ప్రాంతాల్లోనే దాక్కొని ఉంటాడన్న సమాచారంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే... తుంగతుర్తి మండలం కుక్కడంలో అనుమానాస్పదంగా హిందీలో మాట్లాడుతూ... తిరుగుతున్న వ్యక్తిని ప్రశ్నించిన స్థానికులు అతన్ని వెంబడించారు. గ్రామస్థుల తీరుతో అనుమానిత వ్యక్తి వరంగల్ జిల్లా పెముప్పారం వైపు పరారయ్యాడు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కుక్కడం పరిసరాల్లో అన్వేషిస్తున్నారు. సూర్యాపేట పోలీసులను హతమార్చిన సమయంలో ముగ్గురు వ్యక్తులున్నట్టు బాధిత పోలీసులు గుర్తించారు. మరో ముష్కరుడు ఇదే ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police combing  nalgonda  simi suspect  

Other Articles