suspected simi terrorists crimes | terrorists

Suspected simi terrorists crimes

police comb nalgonda, another suspect moving towards warangal, police searches on for another suspect, nalgonda nazeeruddin baba durga, simi terrorist encounter, simi terrorist shot dead,

suspected simi terrorists have huge crime back ground, thrfts, dacoits, and traitor cases

వెలుగుచూస్తున్న సెమీ ఉగ్రవాదులు దారుణాలు

Posted: 04/05/2015 11:13 AM IST
Suspected simi terrorists crimes

నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద ఎన్ కౌంటర్ లో మరణించిన సెమీ ఉగ్రవాదులు అస్లాం, జకీర్‌ల దారుణాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గతంలో మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుండి తప్పించుకున్న ఐదుగురు సిమి ఉగ్రవాదులుగా వీరేనని తెలియడంతో జాతీయ దర్యప్తు బృందం (ఎన్ఐఏ)  కూడా రంగంలోకి దిగింది. ఐదుగురిలో మిగిలిన ముగ్గురు ఏమయ్యారనే విషయమై పోలీసులు, జాతీయ దర్యాఫ్తు సంస్థ ఆరా తీస్తోంది. వీరు ముగ్గురు కూడా దక్షిణాది రాష్ట్రాలలోనే దాడులకు ప్లాన్ చేసి వుంటారని, అందకని దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని ఎన్ఐఏ అధికారులు హెచ్చరిస్తున్నారు.

హతులపై మహారాష్ట్రలో కూడా పలు కేసులు ఉన్నట్లుగా వార్తలు ఎన్ఐఎ తెలిపింది.. సిమీకి చెందిన ఉగ్రవాది అబూ ఫైజల్ ముఠాలో వీరిద్దరు కీలక సభ్యులగా అనుమానిస్తున్నారు. కాగా వీరిద్దరు ఈ ఫిబ్రవరి 14న రైలులో జార్ఖండ్ వాసి వినోద్ టోప్పోని తుపాకీతో బెదిరించి అతని పర్సు, సహా ఓటరు గుర్తింపు కార్డును లాక్కున్నారని, అదే ఇప్పడు హతుల జేబుల్లో లభ్యమైందని తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్సులో సంచరించారని.. నాలుగు బస్సు దోపిడీలకు నమోద కావడంతో ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దీంతో పాటు పలు దొంగతనాలు, దోపిడీలకు కూడా వీరు పాల్పడ్డారని సమాచారం.

గతంలోనూ వీరికి ఘనమైన నేర చరిత్రమే వుందని పోలీసుల దర్యాప్తులో వెల్లవైండి. వీరిద్దరిరూ ముంబై యాంటీ టెర్రరిస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారని... 2007లో కేరళలో ఉగ్రవాద సాయుధ నిర్వహించిన ముఠాలో ఉన్నారు. 2010లో భోపాల్‌లోని ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు బాంబు పేలుళ్ల సంఘటనల్లో వారి పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2013లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీలో బాంబులు పేల్చింది, 2014 అక్టోబర్‌లో కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎస్‌బిఐలో చోరీకి పాల్పడింది కూడా వీరేనని సందేహాలు రేకెత్తుతున్నాయి.

మృతి చెందిన ఉగ్రవాదులు 3 నెలలపాటు తడ ఏరియాలో సంచరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సమీపలోని షార్‌ కేంద్రం వద్ద వీరు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు వీరి కోసం తమిళనాడు పోలీసులు కూడా తడలో గాలించారని తెలుస్తోంది. తమిళనాడులో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని అనుమానించిన పోలీసులు ఉగ్రవాదుల ఫొటోలతో తడలోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ తిరిగారని స్థానిక పోలీసులు చెబుతున్నారు. వారిద్దరు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని నల్లగొండ జిల్లా భువనగిరి డిఎస్పీ తెలిపారు. దుండగులు షార్ప్ షూటర్లని, గతంలో వారికి నేరచరిత్ర ఉందన్నారు. మరోవైపు, నల్గొండ జిల్లా అర్వపల్లి మండలంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police combing  nalgonda  simi suspect  

Other Articles