Advani | Pout | Modi

Advani and modi didnt greet each other andalso advani pout once more

Pout, lk advani, bjp, vajpaye, modi, banglore, conference, amithsha

The fact that party patriarch LK Advani declined to make his usual “guidance speech” in the concluding session is by itself a watershed moment in the BJP’s history. While it’s true that he had been gradually pushed to the margins and is no longer a force of consequence in the BJP or the Modi government, his decision to be nothing more than a mute spectator is an altogether different thing.

పార్టీ పై ఎల్.కె అడ్వానీ మరోసారి అలక.. మాట్లాడుకోని మోదీ, అడ్వానీ

Posted: 04/04/2015 03:51 PM IST
Advani and modi didnt greet each other andalso advani pout once more

భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అడ్వానీ గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలపై మౌనంగా ఉంటున్నారు. అయితే అడ్వానీ కి కనీస గౌరవం కూడా లభించడం లేదని, మోదీని ప్రధానిగా ఎన్నికల కావడం లాంటివి తీవ్రంగా కలిచివేసిందని సమాచారం. దాంతో పార్టీపై కాస్త అలకపూనారు తరువాత మళ్లీ యథావిదిగా పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు. తాజాగా బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు ఎల్కె అద్వానీ మరోసారి అలిగారు. బెంగళూరులో జరుగుతున్న పార్టీ జాతీయ సమావేశాల సందర్భంగా ఆయన అలక పూనినట్టు సమాచారం.  రెండవరోజు సమావేశాల్లో మాట్లాడాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు అమిత్  షా  చేసిన విజ్ఞప్తిని ఎల్కె అద్వానీ తిరస్కరించినట్టు  తెలుస్తోంది.   పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అద్వానీ మాట్లాడక పోవడం ఇంది రెండవసారి.  గతంలో 2013లో గోవాలో జరిగిన సమావేశాల్లోనరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా  పార్టీ చేసిన ప్రతిపాదనకు నిరసనగా ఆయన సమావేశాల నుంచి వెళ్లిపోయారు.

భారతీయ జనతా పార్టీ ఏర్పాటు సమయం నుండి అటల్ బిహారీ వాజ్ వేయితో కలిసి పార్టీ నిర్మాణంలో ఎల్కె అడ్వానీ ఎంతో కీలకంగా వ్యవహరించారు.  అనతికాలంలోనే భారతీయ జనతా పార్టీలో అగ్రనేతగా ఎదిగారు. అయితే గత కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అడ్వానీ అసహనంతో ఉన్నారు. పార్టీలో కీలకంగా ఉన్న అడ్వానీ ని పార్టీ పార్లమెంటరీ బోర్డు నుండి తొలగించి, కేవలం పార్టీ మార్గవర్శక్ సంఘ్ కు మాత్రమే పరిమితం చేశారు. పార్టీని ముందు నుండి విజయవంతంగా నడిపించిన అడ్వానీ కి పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని గత కొంత కాలంగా అడ్వానీ అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. ఇక  లోకసభలో ప్రత్యర్థులపై  తన వాక్చాతుర్యం, వాగ్భాణాలతో విరుచుకుపడే అద్వానీ... తాజా పార్లమెంటు  సమావేశాల్లో ఎక్కడా ఆయన స్వరం వినిపించలేదు.  సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరైనా ఒక్కసారి కూడా  అద్వానీ సభలో మాట్లాడకపోవడం,  ఆయన  నిరాసక్తతకు, తీవ్ర అసంతృప్తికి నిదర్శనమని  పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే మోదీని పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే సమయానికి అడ్వానీ ఎంతో అసహనంతో ఉన్నారు. అందుకే పార్టీ జాతీయ సమావేశాలు గోవాలో జరుగుతున్న సమావేవాల నుండి అర్దంతరంగా వెళ్లిపోయారు. అప్పట్లో మోదీ ప్రధానిగా అడ్వానీకి నచ్చలేదని పుకార్లు వినిపించాయి. అయితే పార్టీలో ఎంతో కాలంగా ఉంటున్నా, ప్రధాని కావాలన్న కోరిక మాత్రం తీరలేదని అందరికి తెలుసు. అయితే మోదీ పై వచ్చిన వివిధ ఆరోపణలు కూడా  అడ్వానీ వ్యతిరేకతకు కారణమైంది. మొత్తానికి ఏదో రూపంలో అడ్వానీ పార్టీ వ్యవమారంపై అలిగారు. తాజాగా మరో సారి మౌన దీక్షకు దిగినట్లు సమాచారం. అయితే బెంగళూరు సమావేశాల సందర్భంగా ఇంకా నోరు విప్పని అడ్వానీని , ప్రధాని మోదీ పలకరించడకపోవడం మరో విశేషం. పార్టీ సమావేశం సమయంలో ఇద్దరూ ఎడ మొహం, పెడ మొహంలా కూర్చుకున్నారు. మరి ఈ సారి అడ్వానీ అలక ఎన్ని రోజులో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pout  lk advani  bjp  vajpaye  modi  banglore  conference  amithsha  

Other Articles