Pictorial warnings | Modi | Health ministry

Pm narendra modi suggest health ministry for make larger pictorial warnings on tobacco products

Nda, Health Ministry, pictorial warnings, controversy, tobacco, Narendra Modi

With the BJP-led NDA government receiving flak from all quarters, Prime Minister Narendra Modi on Saturday asked the Health Ministry to increase the size of pictorial warnings on tobacco product packets to 60 percent. The PM's statement comes amidst controversy over comments by BJP MPs, including those in a parliamentary panel, on the use of tobacco.

ఆ 'హెచ్చరిక' పెద్దగా ఇవ్వండి: ఆరోగ్య శాఖకు మోదీ సలహా

Posted: 04/04/2015 04:10 PM IST
Pm narendra modi suggest health ministry for make larger pictorial warnings on tobacco products

పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం..క్యాన్సర్ కు కూడా కారణం - అని సిగరెట్ బాక్స్ లపై వచ్చే వార్నింగ్ సైజ్ ను మరింత పెంచాలని ప్రధాని మోదీ కేంద్ర ఆరోగ్యమంత్రి జెపి నడ్డాకు సూచించారు. గత కొంత కాలంగా పొగాకు ఉత్పత్తులకు సంబందించి వివాదాస్పద వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో మోదీ ప్రకటన కొంత క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై తీసుకోబోతున్న చర్యలకు సంబందించి కొంత అవగాహన కలిగేలా ప్రధాని మోదీ హెచ్చరిక సైజ్ ను మరింత పెంచాలని సూచించారు. సిగరెట్ బాక్సులపై దాదాపు 60 నుండి  65 శాతం వరకు వార్నింగ్ ఉండాలని కూడా సూచించారని సమాచారం.

పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారం లేదని బిజెపి ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దాంతో భాజపా పార్టీతో మిగిలిన పార్టీలు కూడా దీనిపై చర్చించుకోవడం మొదలు పెట్టాయి. అయితే పొగాకు ఉత్పత్తుల పై వార్నింగ్ ఫలితంగా పొగాకు సంబందిత ఉత్పత్తుల బిజినెస్ తగ్గిపోతుందని మరో ఎంపీ వ్యాఖ్యానించారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా వారి మాటలపై వివరణ ఇచ్చారు. పొగాకు ఉత్పత్తిదారుల లాబీయింగ్ కు తాము లొంగలేదని వెల్లడించారు. గతంలోనే పొగాకు ఉత్పత్తులపై ట్యాక్స్ ను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రిటెల్ గా సిగరెట్ లు అమ్మకుండా కూడా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అయితే మోదీ సూచనతో కేంద్ర ఆరోగ్య శాఖ ఆ మేరకు హెచ్చరిక సైజ్ ను పెంచుతుందా చూడాలి.

- అభినవచారి 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nda  Health Ministry  pictorial warnings  controversy  tobacco  Narendra Modi  

Other Articles