Bjp | India | History | 35years

Bjp party completes 35 years in indian political history

bjp, Bharatiya janata party, nda, lal krishna advani, vajpaye, modi,

bjp party completes 35 years in indian political history. The Bharatiya Janata Partyis one of the two major parties in the Indian political system, along with the Indian National Congress. As of 2014, it is the country's largest political party in terms of representation in the national parliament and state assemblies, and it is the world's largest party in terms of primary membership.

ప్రత్యేకం: 35 ఏళ్ల భారతీయ జనతా పార్టీ .. రాజకీయాలలో బిజెపి మహాప్రస్థానం

Posted: 04/04/2015 01:55 PM IST
Bjp party completes 35 years in indian political history

దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనూషులోయ్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. అలాంటి దేశంలో ప్రజల కోసం ఎన్నో పార్టీలు వచ్చాయి, చరిత్రలో కలిసిపోయాయి. కేవలం కొన్ని పార్టీలు మాత్రమే చరిత్రపుటల్లో చెరగని ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాయి. అలాంటి పార్టీల్లో భారతీయ జనతా పార్టీ పేరు ఖచ్చితంగా ముందు ఉంటుంది. భారతదేశ రాజకీయ  చిత్రంలో అన్ని పార్టీలు స్థానం కోసం ఆరాటపడితే ఒక్క భాజపా మాత్రమే రాజకీయ చిత్రాన్ని మార్చడానికి ప్రయత్నించింది. ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది . భారతీయ జనతా పార్టీ ఏర్పడి 35 సంవత్సరాలు గడిచిన సందర్భంగా గత చరిత్రను, భవిష్యత్ పరిస్థితిని ఒక్క సారి మీ కోసం అవగాహన చేసుకుందాం.

భారతదేశ రాజకీయాల్లో ఎదురు లేని విధంగా ఎదిగిన నేషనల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ 1952 లో జన్ సంఘ్ పార్టీని పెట్టారు. అయితే ఆ పార్టీ పెద్దగా విజయం సాధించలేదు. కానీ జన్ సంఘ్ పార్టీలో కొందరు వ్యక్తులు మాత్రం ఎంతో కీలకంగా ఎదిగారు. 1975 లో ఇందిరా గాంధీఎమర్జెన్సీ కాలంలో చాలా మంది జనసంఘ్ నాయకులను, కార్యకర్తలను జైలులో ఉంచారు.  అలా ఇందిగా గాంధీకి వ్యతిరేకంగా ఒక్కటైన జన్ సంఘ్ నేతలు జనతా పార్టీని స్థాపించారు. తరువాత జనతా పార్టీ లో చీలిక రావడంతో పూర్వపు జనసంఘ్ నేతలు ఆ పార్టీని వదలి బయటకు వచ్చి 1980, ఏప్రిల్ 6న  భారతీయ జనతా పార్టీ ని స్థాపించారు. అలా భారతీయ జనతా పార్టీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇక అప్పటి నుండి భారతదేశ యవనికపై భాజపా తిరుగులేని పార్టీగా ఎదిగింది.

అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ లచే 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది. అటల్ బిహారీ వాజపేయి భాజపా తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1984లో, ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలోకాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించగా, భాజపా 543 నియోజకవర్గాలలొ కేవలం రెండింటిని గెలుపొందింది. లాల్‌కృష్ణ అద్వానీ రథయాత్ర ఫలితంగా 1989 లోక్‌సభ ఎన్నికలలో 88 సీట్లను గెలుచుకొని జనతాదళ్‌కు మద్దతునిచ్చి వీ.పీ.సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి కారణం అయింది. అయోధ్యలో రామజన్మభూమి మందిరాన్ని కట్టాలనే ప్రయత్నంతొ రథయాత్రలో ఉన్న అద్వానీని బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు చేసిన సందర్భాన అక్టోబరు 23, 1990న భాజపా తన మద్దతును వెనక్కితీసుకోగా తదుపరి నెలలో జనతాదళ్ ప్రభుత్యం పడిపోయింది.

1991 లోక్‌సభ ఎన్నికలలో మండల్, మందిర్ ప్రధానాంశాలుగా జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తన స్థానాలను 120కి పెంచుకొని ప్రధాన ప్రతిపక్షం గా మారింది. కాంగ్రెస్ మైనార్టీ ప్రభుత్వం గా పాలన కొసాగించింది. 1996 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద రాజకీయ పక్షం గా అవతరించింది. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అటల్ బిహారో వాజ్‌పేయి ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించగా బి.జే.పి. ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసం పొందుటలో విఫలమైంది. తత్పలితంగా వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులకే పతనమైంది.

తర్వాత 1998 ఎన్నికల్లో భాజపా మెజారీటీ స్థానాలను గెలుపొందింది దాంతో కొత్తగా ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంది. 1998 నుండి అదికారంలోకి రాగా, తరువాత 1998 నుండి 2004 వరకు వివిధ పార్టీలను కలుపుకొని అదికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. అలా 2004 లో అధికారానికి దూరమైన భాజపా తరువాత పార్టీని మరో సారి అధికారంలోకి తీసుకు రావడానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్, మిత్ర పక్షాల కూటమి యుపిఎ రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారాన్ని చలాయించింది.

భారతీయ జనతా పార్టీ మొదటి అధ్యక్షుడిగా వాజ్ పేయ్ తరువాత లాల్ కృష్ణ అడ్వానీ పార్టీ పగ్గాలను చేపట్టారు. పార్టీని ముందుకు తీసుకువెల్లడంలో ఎంతో కీలకంగా కూడా వ్యవహరించారు. తరువాత పార్టీ పగ్గాలు ఎంత మంది చేతులు మారినా అధికారానికి మాత్రం చేరువ కాలేదు. 2014 నుండి అమిత్ షా పార్టీ పగ్గాలను చేతపట్టారు. తరువాత మోదీ హవాతో భాజపా అధికారంలోకి వచ్చింది. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ బారీ మెజారిటీతో అధికారాన్ని సొంతం చేసుకుంది.

మోదీని ప్రధాని అభ్యర్థిగా నిలిపిన తరువాత 2014 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తిరుగులేని బంపర్ మెజారిటీతో గెలిచింది. 281 లోక్ సభ స్థానాలు, 47 రాజ్యసభ స్థానాలతో ఎలాంటి అడ్డులేకుండా కేంద్రంలో అధికారానికి చేరువైంది. అయితే పార్టీలో ఎంతో కీలకంగా ఉన్న అడ్వానీకి మాత్రం తగిన స్థానం లబించలేదు. మార్గదర్శక సంఘ్ లో మాత్రమే అడ్వానీ పేరు ఉండటంతో అడ్వానీ ఎంతో నిరాశ చెందారని వార్తలు వచ్చాయి. అయితే తర్వాత అడ్వానీ మీడియా ముందుకు వచ్చి మోదీ గురించి మాట్లాడారు. మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని తాను సమర్థిస్తున్నానని కూడా అడ్వానీ ప్రకటించారు.

మొత్తానికి అలా సాగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రస్థానంలో మార్చి నెలలో రికార్డు స్థాయిలో వంద మిలియన్ సభ్యత్వాలు నమోదు కావడంతో ప్రపంచంలో ఎక్కువ మంది సభ్యులను కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ చరిత్రకెక్కింది. తాజాగా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ బెంగళూరులో ప్రారంభమయింది. పార్టీకి చెందిన సీనియర్, జూనియర్ నాయకులు అందరూ హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా పార్టీ నేతలతో ఎంతో విసృతంగా చర్చలు సాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అంటేనే ఓ నమ్మకం అనే భావన ప్రజల్లో ఉంది. పార్టీ కూడా అదే నమ్మకాన్ని నిలబెడుతూ ముందుకు సాగుతోంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp  Bharatiya janata party  nda  lal krishna advani  vajpaye  modi  

Other Articles