Sachin | Puttamraju Kandriga

Sachin tendulkar giving puttamraju kandriga as modern miracle

sachin, tendulkar, mp, rajyasabha, parliament, pm, modi, mplads, Puttamraju Kandriga

It took all of four months. Puttamraju Kandriga has gone from being a slummy village to a modern miracle after it was adopted by cricketer-turned-MP Sachin Tendulkar. Concrete roads with tiled pavements, an underground sewage network with a treatment plant, storm-water drains, 24-hour water and power supply, a playground, a community hall

ఎంపీగా సచిన్ సేవలు అదుర్స్..

Posted: 04/01/2015 12:50 PM IST
Sachin tendulkar giving puttamraju kandriga as modern miracle

క్రికెట్ సామాజ్రాన్ని ఏలిన ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. అయితే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ ఏపిలోని పుట్టంరాజుకండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం అందరికి తెలిసింది. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల్లో భాగంగా ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని, దాన్ని ఆదర్శగ్రామంగా మార్చాలి. అయితే దాదాపు అందరు ఎంపీలు ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న కండ్రిగ గ్రామాంలో స్పష్టమైన మార్పు కనిపిస్తూ ఉంది. సచిన్ గ్రామాభి వృధ్దికి చేస్తున్న కృషికి గ్రామస్తుల నుండి అభినందనల వెల్లువసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన పుట్టంరాజుకండ్రిగ గ్రామాన్ని ప్రముఖ క్రీడాకారుడు, ఎంపీ సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్నారు. అప్పటి దాకా కనీసం ఊరు గురించి తెలియదు కానీ సచిన్ దత్తత తో ఒక్క సారిగా వార్తలకెక్కింది. పుట్టంరాజుకండ్రిగ గ్రామంలో కేవలం 390 మంది మాత్రమే నివసిస్తున్నారు. మొత్తం 110 కుటుంబాలు ఉన్న ఈ గ్రామం చెన్నై కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనీసం రవాణా సదుపాయం కూడా లేకుండా నిన్నటి దాకా గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. కరెంట్ కష్టాలు, తాగు నీటి సమస్యలు, తగిన టాయ్ లెట్ లు లేక మహిళలు ఇలా మొత్తం సమస్యల వలయంలో చిక్కుకుంది కండ్రిగ గ్రామం. అయితే సచిన్ టెండూల్కర్ దత్తత తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం సిసి రోడ్లు గ్రామానికి చక్కటి రోడ్డు ప్రయాణానికి వీలు కల్పిస్తున్నాయి. తాగు నీటి వసతి కూడా మెరుగు పడింది. గతంలో కన్నా పరిస్థితి ఇప్పుడు చాలా మారిందని, ఆ మార్పులకు కారణం సచిన్ కృషి అని గ్రామస్తులు కితాబిస్తున్నారు. మొత్తానికి సచిన్ పుట్టంరాజుకండ్రిగ గ్రామాన్ని ప్రగతిపథంలో నడుపుతున్నారు. ఆదర్శగ్రామంగా మార్చాలన్న ప్రధాని కలను నిజం చేసే పనిలో ఉన్నారు సచిన్. క్రికెట్ లో ఎంతో మంది అభిమానులు సంపాదించిన సచిన్, ఇప్పుడు సమాజ సేవలోనూ అందరి నుండి మెప్పు పొందుతున్నారు. ఎంతైనా సచిన్ గ్రేట్ కదా.. హ్యాట్సాఫ్ సచిన్.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin  tendulkar  mp  rajyasabha  parliament  pm  modi  mplads  Puttamraju Kandriga  

Other Articles