India establish new record in world cup 2015

india, world cup 2015, pool b, matches, zimbabwe, icc cricket,

Having reached the quarter-finals with one commanding performance after another, defending champions India will be aiming to finish their group league engagements with a flourish when they take on Zimbabwe in the ICC Cricket World Cup 2015. India are currently on a roll in the tournament as they have practically crushed most of their oppositions save the West Indies, which at the most gave them a scare during the group league game at the WACA in Perth.

ప్రపంచకప్ లో భారత్ మరో రికార్డ్

Posted: 03/14/2015 10:57 AM IST
India establish new record in world cup 2015

ప్రపంచకప్‌లో భారత్‌ అరుదైన రికార్డును నమోదు చేసింది. వరుసగా జరిగిన ఆరు మ్యాచుల్లోనూ ప్రత్యర్థి జట్లను భారత్‌ ఆలౌట్‌ చేసింది. శనివారం ఆక్లాండ్‌ వేదకిగా జరిగిన మ్యాచ్‌లో 287 పరుగులకు జింబాబ్వే ఆలౌట్‌ అయింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా దిగిన టీమిండియా రికర్డుల మోత మోగిస్తోంది. పాకిస్థాన్ తో ఆడిన మొదటి మ్యాచ్ నుండి ఈ రోజు జరుగుతున్న జింబాంబే మ్యాచ్ వరకు అన్ని మ్యాచ్ లలో భారత క్రికెటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. పూల్ బిలో 10 పాయింట్లతో నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది. ప్రపంచ కప్ లో అంచనాలతో అడుగుపెట్టిన సౌతాప్రికాను మట్టి కరిపించి, టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది.

ఈ సారి ప్రపంచ కప్ లో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసి, భారత్ కొత్త రికార్డుకెక్కింది. ఎప్పుడూ బ్యాటింగ్ ద్వారా రికార్డులను స్వంతం చేసుకునే మన వాళ్లు ఈ సారి బౌలింగ్ లోనూ అదరగొడుతున్నారు. భారత బౌలర్లు 6 మ్యాచ్ల్లో 60 వికెట్లు పడగొట్టారు. వెస్టిండిస్ , సౌతాఫ్రికాలకు చెందిన మంచి మంచి బ్యాట్స్ మన్ లను సైతం మన వాళ్లు ఫెవీలియన్ బాట పట్టిస్తున్నారు. జింబాంబేతో జరుగుతున్న మ్యాచ్ లో మహ్మద్ షమి, ఉమేష యాదవ్, మోహిత్ శర్మ తలా మూడు వికెట్లు తీశారు. 48.5 ఓవర్లలో 287 పరుగులకు జింబాంబే ఆలౌట్ అయింది. దాంతో భారత క్రికెట్ చరిత్రలో మరో రికార్డు స్వంతమయింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  world cup 2015  pool b  matches  zimbabwe  icc cricket  

Other Articles