India prime minister narendra modi in srilanka tour

modi, srilanka, tour, pm, rajiv gandhi, fishermen, sirisena,

Prime Minister Narendra Modi has said India and Sri Lanka need to find a long term solution to the fishermen's issue, which he noted involved livelihood and humanitarian considerations on both sides. He also said fishermen's organisations from the two countries need to have another round of meetings soon to find a mutually acceptable solution.

శ్రీలంకలో మోదీ.. పలు ఒప్పందాలపై సంతకాలు

Posted: 03/13/2015 01:43 PM IST
India prime minister narendra modi in srilanka tour

ప్రధాని మోదీ శ్రీలంక పర్యటనలో పలు ఒప్పందాలు చేసుకున్నారు. జాలర్ల సమస్యపై రెండు దేశాలు దీర్ఘకాలికంగా సమస్యలు లేకుండా పరిష్కారాన్ని కోరుతున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. శ్రీలంక అధ్యక్షులు మైత్రిపాల సిరసేనతో కలిసి ఇరు దేశాలకు సంబందించి ఒప్పందాలపై సంతాకాలు చేశారు. అయితే దాదాపు 29 సంవత్సరాల క్రితం భారత ప్రధాని రాజీవ్ గాంధీ తరువాత మోదీ మొదటి సారి శ్రీలంకలో పర్యటిస్తున్నారు.

శ్రీలంక గత కొంత కాలంగా భారత జాలర్లపై దాడులకు దిగుతోంది. తమ జలాల్లోకి వస్తున్నారని ఆరోపిస్తు, భారత జాలర్లను వారు అరెస్టు చేస్తున్నారు. దీనిపై గత కొంత కాలంగా వివాదం నెలకొంది. కాగా శ్రీలంక ప్రధాని మా జలాల్లోకి వస్తే కాల్చి వెయ్యడానికి కూడా తమ చట్టం అనుమతి ఇస్తుందని అని చేసిన వ్యాఖ్యలు రెండు దేశాలపై ప్రభావాన్ని చూపాయి. అయితే మోదీ మాత్రం వాటిపై స్పష్టత ఇస్తూ ఓ ఒప్పందాన్ని చేసుకు వస్తారని అందరు ఆశగా ఉన్నారు. మోదీ శ్రీలంక పర్యటనకు ముందు 87 మంది భారత జాలర్లను వదిలిపెడుతున్నట్లుగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.

భారత్, శ్రీలంకల మధ్య దూరాన్ని తగ్గించడానికి వీసాను మరింత సరళతరం చెయ్యడానికి రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. కస్టమ్స్ సుంకాలపై కూడా రెండు దేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. యువతలో నైపుణ్యాలను పెంయడానికి రెండు దేశాలు ఓ ఎంఓయును కుదుర్చుకున్నాయి. శ్రీలంకలో రబీంద్రనాథ్ ఠాగూర్ మ్యుజియం నిర్మాణానికి భారత్ సహకరించనుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  srilanka  tour  pm  rajiv gandhi  fishermen  sirisena  

Other Articles