The interview virus threat to the smart phonesta

the interview virus threat to the smart phones, smart phones, 'the interview virus, virus threat to smart phones, virus threat to smart mobile phones, sony pctures, the interview movie release stopped, the interview movie online, north korea,

the interview virus threat to the smart phones

ది ఇంటర్య్వూ.. చిత్రం కాదు స్మార్ట్ ఫోన్ వైరస్..

Posted: 02/21/2015 04:05 PM IST
The interview virus threat to the smart phonesta

ది ఇంటర్య్వూ.. ఇది హాలివుడ్ చిత్రం కాదు స్మార్ట్ ఫోన్ వైరస్.. దేశంలో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్లపై దాడి చేసేందుకు సరికొత్త వైరస్ దేశీయ సైబర్‌స్పేస్‌లో హల్‌చల్ చేస్తోంది. గతేడాది చివర్లో అమెరికా-ఉత్తర కొరియాల మధ్య మాటలయుద్ధానికి దారితీసిన వివాదాస్పద హాలీవుడ్ చిత్రం ‘ద ఇంటర్వ్యూ’ పేరిట స్మార్ట్‌ఫోన్లలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటర్నెట్ యూజర్లు ఎవరైనా తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఈ చిత్రం ఉచిత డౌన్‌లోడ్ లింక్‌ను క్లిక్ చేస్తే ట్రోజన్ తరహా వైరస్ ఫోన్లోకి చొరబడి వారి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తుంది. అందువల్ల ఈ వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేశీయ సైబర్ భద్రతా పరిరక్షణ నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) తాజా మార్గదర్శకాల్లో సూచించింది.

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌ను హతమార్చే కాల్పనిక కథాంశంతో సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంపై వివాదం రేగడం, సినిమా విడుదలకు ముందే అమెరికాలోని సోనీ పిక్చర్స్ ప్రధాన కార్యాలయంపై సైబర్ దాడి జరిగి చిత్రం ఇంటర్నెట్‌లో లీక్ కావడం తెలిసిందే. ఇందుకు ఉత్తర కొరియానే కారణమని అమెరికా ఆరోపించగా ఆ ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లలో ఈ చిత్రం విడుదలను రద్దు చేసుకున్న సోనీ కేవలం కొన్ని కళా కేంద్రాల థియేటర్లు, ఇంటర్నెట్‌లో దీన్ని విడుదల చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : smart phones  'the interview  virus threat  

Other Articles