Aviation minister ashokagajapathi on special status

ashokgajapathi raju, aviation minister, special status for ap, arunjaitly, finance minister

central minister ashokgajapathi raju said to media that if special status for ap will not come, he is no use as central minister. and he also respond on congress president sonia gandhis letter. most of congress cms oppose the letter.

ప్రత్యేక హోదా రాకుంటే పదవిలో ఉన్నా లేనట్లే

Posted: 02/21/2015 12:34 PM IST
Aviation minister ashokagajapathi on special status

విభజన సమయంలో ఆంథ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే యుపిఎ స్థానంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్, ఏపికి ప్రత్యేక హోదాపై వెనకడుగు వేస్తోంది. అన్ని రాష్ట్రాల అనుమతి లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అయితే తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు ఏపికి ప్రత్యేక హోదా రాకపోతే, తాను పదవిలో ఉన్నా లేనట్లే అని వ్యాఖ్యానించడం తీవ్ర సంచలనం రేపింది. అయితే ఈ విషయంపై తాను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడానని, ప్రత్యేక హోదాపై మంత్రి కూడా సుముఖత వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. కేంద్రం తాము ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాసిన లేఖపై ఆయన స్పందించారు. సోనియా లేఖపై కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నుండే వ్యతిరేకత వ్యక్తమైందని అన్నారు. కాంగ్రెస్ స్కాముల మూడ్ నుండి స్కీముల మూడ్ కు మారడానికి కొంత టైం పడుతుందని ఆయన విమర్శించారు.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles