Pm modi to attend tilak ceremony of mulayam s grandnephew today

PM Modi to attend Tej pratap tilak ceremony, PM Modi to attend Mulayam's grandnephew tilak ceremony, Prime Minister Narendra Modi, Mulayam's grandnephew Tej pratap tilak ceremony, Tej Pratap Singh wedding, Tej Pratap Singh, Mulayam Singh Yadav grand nephew wedding, Mulayam Singh Yadav grand nephew Tej Pratap Singh wedding, Tej Pratap Raj Laxmi wedding, Lalu Prasad Yadav daughter wedding Lalu Prasad Yadav Raj Laxmi wedding

Prime Minister Narendra Modi will on Saturday attend pre-wedding ceremony of Samajwadi Party supremo Mulayam Singh Yadav's grandnephew in Saifai village

ములాయం మనవడి తిలకం వేడుకకు ప్రధాని మోడీ..

Posted: 02/21/2015 11:15 AM IST
Pm modi to attend tilak ceremony of mulayam s grandnephew today

సమాజ్ వాదీ పార్టీ అద్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మనవడి పెళ్లికి ముందు నిర్వహించే తిలకం దిద్దే కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నారు. ములాయం తనయ కుమారుడు, మెయిన్ పూరి పార్లమెంట్ సభ్యుడు తేజ్ ప్రతాప్ సింగ్ వివాహం బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కనిష్ట పుత్రిక రాజ్ లక్ష్మీతో కుదిరిన విషయం తెలిసిందే. ఈ నెల 26న హస్తినలో వారిరువురి పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిపించనున్నారు.

వివాహ మహోత్సవానికి ముందు తమ సంప్రదాయాల ప్రకారం ఏర్పాటు చేసిన తిలకం దిద్దే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది కూడా పెళ్లి లాంటి వేడుకే. అందుకనే ములాయం కుటుంబ సభ్యులు సుమారు లక్ష మంది అతిధులను ఈ తిలకం దిద్దే వేడుకకు ఆహ్వానించారు. వారి ఆవ్వానాన్ని మన్నించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తున్నారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ లోని ఇటావాహ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో వున్న సైఫై గ్రామాం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ తారలు, గాయకులు, ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నందున గ్రామం స్వాగతం పలికేందుకు సిద్దంగా వుందట.

ప్రధాని రాక ఖరారు అయిన నేపథ్యంలో ఆయన ప్రత్యేక రక్షణ ధళం సభ్యులు భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రధాని హెలికాఫ్టర్ దిగే హెలిఫ్యాడ్ ను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేసినట్లు సమాచారం. తిలకం దిద్దే వేడుక హాజరుకానున్న అతిధులకు పలు రకాల రుచికరమైన, స్వచ్చమైన నేతితో చేసిన మిఠాయిలు అందించనున్నారు. బిదాయ్, బాటీ చోఖా, హల్వా వంటి రుచికరమైన వంటకాలను కూడా సిద్దం చేశారట.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian wedding  Tej Pratap Singh  Mulayam Singh Yadav  

Other Articles