Ramanaidu funeral completed in hyd

ramanaidu funeral, movie moghal, legendery producer in telugu, ramanaidu death, ramanaidu studio

ramanaidu funeral completed in hyd : legend producer ramanaidu funeral completed. cinema artists, political leaders and fans of ramanaidu follow the funeral.

మూవీ మొఘల్ మజిలీ ముగిసింది

Posted: 02/19/2015 04:32 PM IST
Ramanaidu funeral completed in hyd

మూవీ మొఘల్ రామానాయుడు అంతిమ యాత్ర ముగిసింది. తెలుగు సినిమా ప్రతిష్ఠను ఆకాశానికెత్తిన మహానుభావి, నేడు అదే ఆకాశంలో తార చెంతకు చేరారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ, పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు, బంధువులు రామానాయుడుకు కన్నీటి వీడ్కోలు పలికారు. భారత సినిమా కీర్తి పతాకాన్ని గర్వంగా ఎగరవేసిన రామానాయుడుకి ఇక సెలవంటూ నిశబ్దంగా నివాళి అర్పించారు. రామానాయుడు పార్థివ దేహాన్ని చూడడానికి  అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, పలువురు అధికారులు తరలివచ్చారు. రామానాయుడు స్టూడియోలో తమ అభిమాన నటున్ని, తెలుగు సినిమా దిగ్గజాన్ని కడసారి చూపు చూసి కన్నీరు కార్చారు. తెలుగు సినీ వినీలాకాశంలో విరబూసిన మరో కుసుమం రామానాయుడు..ప్రస్తుతం మన మధ్య లేకపోయినా, మరుపు రాని చిత్రాలనందించి అందరి మదిలో శాశ్వతంగా నిలిచి ఉంటారు..ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles