Kishore chandradeo sentenced that people dont believed congress

kishore chandradeo, congress, aap, bihar elections, delhi polls, congress senior leader kishore chandradeo

kishore chandradeo sentenced that people dont believed congress : congress has to get the credibility. but the congress cader didnt like to do that. ap bifercation may lost the congress in ap and ts.

కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం లేదు: కిశోర్ చంద్రదేవ్

Posted: 02/16/2015 09:28 AM IST
Kishore chandradeo sentenced that people dont believed congress


వరుస వైఫల్యాలతో కుంగిపోయిన కాంగ్రెస్ పై విమర్శల పర్వం కొనసాగుతోంది. మాజీ కేంద్ర మంత్రి కిశొర్ చంద్రదేవ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడో తప్పుందని, దాన్ని మూలాలను సరిచెయ్యడానికి కాంగ్రెస్ నాయకత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. పార్టీలో సీనియర్ గా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉన్న కిశోర్ లాంటి నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. ఆంధ్రప్రదేశ్ ను విభజించినందుకే అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ కు కాలం చెల్లిందని కొందరు నాయకులు చెప్పారు. కానీ బీహార్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పార్టీ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని ఆయన అన్నారు. పార్టీలో ప్రతి విషయానికి డబ్బు కొలమానంగా మారిందని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి లేదంటే ప్రజలు మరో పార్టీని చూసుకుంటారు అని ఆయన అన్నారు. ప్జలు అతి వాద మతతత్వ పార్టీని కాకుండా సునిశిత, అభ్యుదయ భావాలున్న పార్టీలను కోరుకుంటున్నారని, అందులో భాగంగానే ఢిల్లీ ప్రజలు ఆప్ కు అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. స్వంత పార్టీ నేత ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం సంచనం కలిగిస్తోంది. గతంలో యుపిఎ రెండవ సారి అధికారంలో ఉన్నప్పుడు కిశోర్ చంద్రదేవ్ పర్యావరణ శాఖ మంత్రిగా పని చేస్తు, కొన్ని కీలక ప్రాజెక్టులకు అడ్డుతగలడం అప్పట్లో సంచనాన్ని సృష్టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles