Isis executions show medieval brutality

ISIS executions, Thrown from a roof, stoned to death and crucified, ISIS released photographic evidence, horrific executions, gays thrown from tall buildings, brutal punishment to gay, masked Islamic State fighter, homosexual activities, homo sexual, hanged metal crosses, Islamic State’s radical interpretation of Sharia law.

ISIS have released photographic evidence of a series of horrific executions which includes throwing people from tall buildings, stoning people to death, tying them to makeshift metal crosses & shooting them to death.

ITEMVIDEOS: ఆటవిక న్యాయం.. అనాగరిక తీవ్రవాదం..

Posted: 01/20/2015 03:35 PM IST
Isis executions show medieval brutality

ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. అత్యాధునిక తుపాకులను, బాంబులను చేతపట్టిన వారు ఆటవిక న్యాయవ్యవస్థను నడుపుతున్నారు. చట్టాలను, న్యాయవ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకుని అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. స్వలింగ సంపర్కులు (గే) అన్న కారణంతో ఇరాక్‌లోని నినేవా పట్టణంలో ఇద్దరు యువకులను బహుళ అంతస్థుల భవనంపై నుంచి కిందకు తోసి చంపారు. అక్రమ సంబంధం కలిగి ఉందంటూ ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపారు. శిలువ వేసి వారి మెడ చుట్టు గట్టిగా బిగించి మరి కొందరిని చంపారు. మొత్తంగా వివిధ కారణాలతో 20 మందిని అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్నారు.

గత రెండ్రోజుల్లో ఐఎస్ ఉగ్రవాదులు ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు లండన్‌లోని సిరియాకు చెందిన మానవ హక్కుల సంస్థ ఒకటి వెల్లడించింది. శిక్షల అమలుకు ముందు ఒక వ్యక్తి తన చేతిలోని రేడియోతో అక్కడి వారికి ఒక సందేశాన్ని వినిపించాడు. ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినందున శిక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఒక యువకుడిని అందరూ చూస్తుండగానే ఎత్తై  భవనం నుంచి కిందకు తోశారు. అనంతరం మరో వ్యక్తిని అలాగే చంపేశారు. అయితే ఈ బహిరంగ శిక్షలను వీక్షించేందుకు అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమ్మిగూడారు. చేతుల్లో తుపాకులతో ముసుగులు ధరించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పరోక్షంగా ప్రజలను హెచ్చరించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Gays  executions  evidence  

Other Articles