Tiger population on the rise india home to more than 2 000 big cats

Tiger population on the rise, India home to more than 2,000 big cats, uttarakhand, tamilnadu, madya pradesh, maharastra, Corbett National Park, Kaziranga National Park, reserves in southern India

Tiger population in India is estimated to be 2,226 in 2014, according to a new report released on Tuesday.

పులిరాజుల సంఖ్య విజృభిస్తోంది.. జాగ్రత్తా..

Posted: 01/20/2015 04:38 PM IST
Tiger population on the rise india home to more than 2 000 big cats

భారత్ లో పులిరాజుల సంఖ్య క్రమంగా విజృభిస్తోంది.. గత కోన్ని దశాబ్దాలుగా తగ్గుతూ.. వస్తున్న పులుల సంఖ్య గణనీయంగా పెరింగింది. ఏడేళ్ల క్రితం 1406గా వున్న పులుల సంఖ్య 2014లో 2226కు పెరిగింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ  తాజాగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆ శాఖా మంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గతున్న నేపథ్యంలో భారత దేశంలో మాత్రం పెరగడం హర్షదాయకమన్నారు. ప్రపంచంలోని 70 శాతం పులులు భారత్ లోనే వున్నాయని ఆయన వివరించారు.

కర్ణాటకలో అత్యధికంగా 406 పులులు వున్నాయని ఆయన తెలిపారు. ఉత్తరాఖండ్ లో 340, తమిళనాడులో 229, మధ్యప్రదేశ్ లో 208, మహారాష్ట్రలో 190 పులులు వున్నాయని జావదేకర్ తెలిపారు. ఏడాది కాలంగా చేపట్టిన సర్వే ఫలితంగానే తమ దేశంలో పులులు సంఖ్య గణనీయంగా పెరిగిందని అంటున్నారు. అయితే మొత్తం పులుల సంఖ్యలో సుమారు 80 శాతం పులుల ఫోటోలు తమ వద్దనున్నాయని తెలిపారు. గత కొంత కాలంగా పులులు మనుషులపై బడి దాడులు చేయడం, ఆహారంగా చేసుకోవడం వంటి ఘటనలు కూడా తగ్గాయని చెప్పారు. అనాధ పులిబిడ్డలను దత్తత తీసుకునేందుకు కూడా కేంద్రం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.

20వ శతాబ్దం ప్రారంభంలో మన దేశంలో లక్షకు పైగా వున్న పులుల సంఖ్య, వేటగాళ్ల పుణ్యమా అని క్రమంగా తగ్గిపోయాయి, క్రమంగా 21వ శతాబ్దంలోకి చేరుకునే సరికి కేవలం 3000కు మాత్రమే పరిమితమయ్యాయి. అక్కడి నుంచి 2006 కు చేరుకునే సరికి మరింతగా పులుల సంఖ్య క్షీణించి.. 1411గా నమోదైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన కేంద్ర ప్రభుత్వం.. టైగర్ టాస్క్ ఫోర్స్ తో పాటు వాటి రక్షణకు కూడా కట్టదిట్టమైన చర్యలను చేపట్టింది. అయితే.. ఇప్పుడు క్రమంగా పులులు వాటి సంఖ్యను పెంచుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tiger population  rise  India  union government  

Other Articles