Four wives and 40 children will not work in india sakshi maharaj

BJP MP Sakshi Maharaj, four wives doesn't work in india, 40 children not work in india, sakshi maharaj, bip issues show cause notice, sakshi maharaj in another controversy, Hindu women, Hindu women produce four children, sakshi maharaj remained defiant, notice is internal matter, Sakshi Maharaj in show cause notice,

BJP MP Sakshi Maharaj, who stirred a controversy by asking Hindu women to produce at least four children, remained defiant on Tuesday despite the party issuing him a show-cause notice, and said it was an "internal matter" of the party.

మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ‘సాక్షి’

Posted: 01/14/2015 10:47 AM IST
Four wives and 40 children will not work in india sakshi maharaj

బీజేపి ఎంపీ సాక్షి మహరాజ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతీ హిందూ స్త్రీ నలుగురు పిల్లలను కనాలని అయన పునరుద్ఘాటించారు. 'నలుగురు భార్యలు,40 మంది పిల్లలు' అనే భావన మన దేశంలో పనిచేయదన్నారు. అందువల్ల  హిందూ మతాన్ని రక్షించుకోవాలంటే ప్రతి హిందూ మహిళ తప్పనిసరిగా నలుగురు పిల్లలను కనాలని ఆయన పునరుద్ఘాటించారు. మీరట్లోని బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సాక్షి మహారాజ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బీజేపీని ఇరకాటంలో పెడుతున్నారు.  ఇంతకు ముందు ఒకసారి జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడని కొనియాడి..  పార్లమెంట్‌లో క్షమాపణలు చెప్పారు. వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న సాక్షి మహరాజ్కు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన ఆదేశాల మేరకు బీజేపీ షోకాజ్ నోటీసు జారీచేసింది. ''పార్టీ హెచ్చరించినా లెక్కచేయకుండా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో తెలపాలి'' అని ఆ నోటీస్లో పేర్కొంది.

ఈ నోటీస్ విషయమై విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించగా,  పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేయడం పార్టీ అంతర్గత వ్యవహారం అని మహారాజ్  అన్నారు. నోటీస్ అందిన తరువాత సమాదానం చెబుతామని చెప్పారు. ''ఈ విషయమై తాను తమ పార్టీతో మాట్లాడతానన్నారు. మీడియాతో మాట్లాడనంటూ విలేకరులకు చెప్పారు. పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసినప్పటికీ ఆయన మళ్లీ మళ్లీ ఆ వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sakshi Maharaj  BJP  show-cause notice  four children  Hindu women  

Other Articles