Jackie chan s son blames actor for jail term

Jackie Chan's son blames him, actor for jail term, Chinese actor Jaycee Chan, kung fu star Jackie Chan, Jaycee Chan landing up in jail, Jaycee Chan drug abuse charges, Jaycee Chan three-page letter, jackie chan neglected Jaycee Chan, jackie chan guiding hand., Jaycee Chan blames jackie chan

Chinese actor Jaycee Chan has blamed his famous kung fu star father Jackie Chan for landing up in jail on charges of drug abuse.

అంతా మా నాన్నే చేశాడు.. జైలులో పెట్టించాడు..

Posted: 01/13/2015 07:53 PM IST
Jackie chan s son blames actor for jail term

మాదక ద్రవ్యాల కేసులో అరెస్టై జైలుపాలైన చైనా నటుడు జెసీ చాన్.. తాను జైలు పాలు కావడానికి తన తండ్రే కారణమంటున్నాడు. అంతా తన తండ్రే చేశాడని ఆరోపిస్తున్నాడు. తాను యుక్త వయస్సులో చెడు మార్గాలకు అకర్షితుడిని కావడానికి తన తండ్రి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నాడు. ఇంతకీ తన తండ్రి ఎవరనేగా మీ సందేహం. జెసీ చాన్ తండ్రి మరెవరో కాదు విశ్వావిఖ్యాత కింగ్ ఫూ నటుడు జాకీచాన్. జెసీ చాన్ జైలుకు వెళ్లడానికి తండ్రే ప్రధాన కారణమని ఆరోపించాడు. తనకు మార్గదర్శిగా నిలవాల్సిన తండ్రి తనను పూర్తిగా విస్మరించాడన్నారు.

తను మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైనందుకు సిగ్గుపడుతున్నానని తల్లి జాన్ లిన్ కు రాసిన లేఖను ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశాడు. జాకీచాన్ పై కుమారుడు ఆరోపణలు చేయడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా జేసీ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. సెలబ్రిటీల కుటుంబంలో పుట్టడం వల్ల తను ఎంతో విలాసవంతమైన జీవితం గడిపాన్నారు. తన తండ్రి ఎప్పుడూ సినిమాలతో బిజీగా గడిపేవారని, తనను ఏ రోజూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ సంఘటనలతో సహజంగానే తను తల్లికి దగ్గరయ్యానన్నారు.  జేసీ జైలు పాలై ఐదు నెలలైనా ఇప్పటివరకూ తల్లిదండ్రులిద్దరూ చూడటానికి రాలేదని ఆరోపించారు.

జీవితంలో విజయం సాధించడానికి ఏదో తెలియని ఒత్తిడి అనుభవించానని జాయ్ చెప్పాడు. జనవరి 9న విచారణ జరగడానికి ముందు ఐదు నెలలు జాయ్‌సీని చూడడానికి తల్లితండ్రులు రాలేదని అతని మేనేజర్ చెప్పాడు. ఆ తరువాత అతనిని చూడటానికి జైలుకు వచ్చిన తల్లి చూచి, దుఃఖం ఆపుకోలేక ఏడ్చిందన్నాడు. డిసెంబరు 3న జాయ్‌సీ తన పుట్టిన రోజును జైల్లో ఒక్కడే జరుపుకున్నాడని మేనేజర్ తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jackie Chan  Jaycee Chan  drugs  jail term  

Other Articles