Arvind panagariya vice chairman of niti aayog

Arvind Panagariya Niti Aayog, Arvind Panagariya wiki, Arvind Panagariya biography, Arvind Panagariya updates, Niti Aayog programme, Niti Aayog latest updates, Niti Aayog members, Niti Aayog team, planning commission latest, nda government updates, telangana latest, national news updates

Arvind Panagariya vice chairman of Niti Aayog : Arvind Panagariya named as Narendra Modis Niti Aayog vice president. Panagariya is a professor of Economics at Columbia University. In Niti Aayog rajnath singh, arnu jaitley, suresh prabhu and others mentioned as members

ఎవరీ పనగరియా...?

Posted: 01/06/2015 07:32 AM IST
Arvind panagariya vice chairman of niti aayog

కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో ప్రధాని నరేంద్రమోడి ఏర్పాటు చేసిన.., ‘నీతి ఆయోగ్’ తొలి వైస్ చైర్మన్ గా అరవింద్ పనగరియా నియమితులయ్యారు. 62ఏళ్ల పనగరియా ఆర్దికవేత్తగా పేరు ప్రఖ్యాతి పొందారు. బిటెక్ దెబ్రాయ్, సారస్వత్ పూర్తి కాలపు సభ్యులుగా ఎంపికయ్యారు. వీరి నియామకంపై సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రతిష్టాత్మక ‘నీతి ఆయోగ్’కు నియామకం అయిన అరవింద్ పై అందరి దృష్టి పడింది. అసలు ఎవరీయన, అంత గొప్ప చదువులు ఏం చదివారు అని అంతా నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. మోడిని మెప్పించి, అయోగ్ అధిపతి అయ్యేందుకు అరవింద్ కు అనుకూలించిన అంశాలేమిటో చూద్దాం.


రాజస్థాన్ విశ్వ విద్యాలయం నుంచి పట్టభద్రుడైన పనగరియా... ఆర్ధికవేత్తగా అనేక సంస్థల కోసం పనిచేశాడు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ వాణిజ్య సంస్త, యుఎన్.సీ.టీ.ఎ.డీ. లో అనేక హోదాల్లో పనిచేశాడు. మరోవైపు ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రధాన ఆర్ధికవేత్తగా కూడా పనిచేశాడు. అమెరికాలోని కొలంబియా యునివర్సిటీలో అర్థశాస్ర్త ప్రొఫెసర్ గా పనిచేశాడు. దీంతో పాటు యునివర్సిటీ ఆఫ్ మేరి ల్యాండ్ లో ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ గా, కొ-డైరెక్టర్ గా పనిచేశాడు. మోడి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ర్ట అభివృద్ధి విధానాలను బలంగా సమర్ధించాడు. రాజస్థాన్ ప్రభుత్వానికి ఆర్ధిక సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు.

ఇలా అర్దశాస్ర్తంలో కీలక వ్యక్తిగా ఎదిగినందువల్లే ఆయన్ను తీసుకొచ్చి మోడి కలల ప్రాజెక్టుకు సారధిని చేశాడు. దేశాన్ని ముందుకు నడిపేందుకు ప్రణాళికలు వేయటంతో పాటు, సత్వర బాటలు వేసే సత్తా ఉందని ప్రధాని బలంగా నమ్ముతున్నాుడు. ఆయన నమ్మకం నెరవేరి, దేశం అభివృద్ధి చెందాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aravind Panagariya  Niti Aayog  Narendra Modi  

Other Articles