Telanagana government to take back land allotted to rosaiah s son in law

Telanagana Government takes roshaiahs kins land, Government takes Rosaiah's son-in-law land, Telangana Home minister Nayini narsimha reddy , TS government takes allocated land to Roshaiah kin, Telangana Government gives shock to Roshaiah, Tamilnadu Governer Roshaian shock,

The Telangana Government likely to take back 1.5 acres in Secunderabad which was allotted to Nice Foundation, an institution run by Tamil Nadu Governor K. Rosaiah's son-in-law.

రోశయ్య అల్లుడికి కేటాయించిన భూమి వెనక్కి..

Posted: 12/25/2014 04:27 PM IST
Telanagana government to take back land allotted to rosaiah s son in law

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన అల్లుడికి కేటాయించిన భూమిని వెనక్కు తీసుకునే యోచనలో వుంది. మల్లెపల్లిలోని నియోనాటల్ ఇన్‌టెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీస్(నైస్) ఆస్పత్రికి కట్టబెట్టిన ఎకరా స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర హోం, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న మల్లెపల్లి పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)కు చెందిన 22 ఎకరాల భూమిలోంచి ఎకరా స్థలాన్ని తన అల్లుడికి చెందిన నైస్ ఆస్పత్రికి కేవలం కోటి రూపాయలకే కారుచౌకగా కట్టబెట్టారని నాయిని ఆరోపించారు.

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలసి మల్లెపల్లి ఐటీఐలో తనఖీలు నిర్వహించారు. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థకు చెందిన స్థలాన్ని ప్రైవేటు ఆస్పత్రికి కేటాయించడం చట్టవిరుద్ధమని అభ్యంతరం తెలుపుతూ నాటి కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా.. పట్టించుకోకుండా బంధుప్రీతికి పాల్పడ్డారన్నా రు. స్థలానికి చెల్లించాల్సిన రూ. కోటి కూడా ఇప్పటికీ ఉపాధికల్పన శాఖకు జమ చేయలేదని, కానీ.. నైస్ ఆస్పత్రి యాజమాన్యం దర్జాగా భవనాన్ని నిర్మించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanagana Government  konijeti Roshaiah  land allocation  Nice Hospital  

Other Articles