Ebola virus kills over 7 000

worst ebola outbreak, ebola death tops 7000, ebola kills over 7000, ebola high alert, ebola ruined south africa, ebola ruined sierra leone, WHO UN tour ebola affected countries, ban ki moon tour ebola affected countries, Un secratary tour ebola affected countries, west africa high alert

The worst Ebola outbreak on record has now killed more than 7,000 people, with many of the latest deaths reported in Sierra Leone, the World Health Organization said as United Nations Secretary-General Ban Ki-moon continued his tour of Ebola-affected countries in West Africa on Saturday.

ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి మహమ్మారి రోగం

Posted: 12/21/2014 02:43 PM IST
Ebola virus kills over 7 000

మాయదారి మహమ్మారి రోగం ఎబోలా ప్రాణాలను కబళిస్తుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వల్ల ఇప్పటివరకూ 7373 మంది మరణించినట్లు రికార్డుల్లో నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఇది ఆందోళనకర పరిణామంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వీరిలో అధిక మంది మృతులు దక్షిణాఫ్రికాలోని సియెర్రా లియోన్ దేశంలోనే నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీంతో పాటు లైబీరియా, గినియాల్లో మరణాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. వీటికితోడు మాలిలో ఆరుగురు, నైజీరియాలో 8 మంది, అమెరికాలో ఒకరు మరణించారని వెల్లడించింది.

కాగా ఎబాలా వ్యాధి ప్రచండ వేగంతో విస్తురిస్తుండం వల్ల గినియా, సియెర్రా లియోన్, లైబీరియాల్లో నమోదైన కేసులు 19,031కి చేరాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా మరణాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాఫ్రికాలోని ఎబోలా బాధిత ప్రాంతాలలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ తో పాటు తామ ప్రతినిధులు పాల్గోననున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బుధవారం 6 వేల 900లుగా వున్న మరణాలు కేవలం రెండు రోజుల్లోనే మూడు వందల తొంబై రెండు మంది మరణించడం వ్యాధి ప్రభావాన్ని తెలుపుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ebola  7000 dead  west africa  WHO  UN  Ban ki moon  

Other Articles