Kcr to replicate ramoji film city

Telangana government to replicate Ramoji Film City, Kcr to replicate Ramoji Film City,

Telangana Chief Minister K Chandrasekhar Rao will make an aerial survey of Rachakonda hills in Ranga Reddy district on the outskirts of Hyderabad on Monday. The aerial survey is aimed at finding a suitable place for Film City being planned by the Chief Minister.

తెలంగాణ ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీలానే వుంటుందా..?

Posted: 12/16/2014 10:42 AM IST
Kcr to replicate ramoji film city

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కలసి రామోజీ ఫిల్మ్ సిటీలో పర్యటించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పార్టీ నుంచి నేతల వరకు ఎవరన్నా అసలు గిట్టని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ పార్టీకి జవసత్వాలు అందించడంలో తన వంతు తోడ్పాటును అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుల మధ్య ఎలా సయోధ్య కుదిరిందని అందర విస్తుపోతున్న తరుణంలో.. సాగిన ఈ భేటీ వెనుక అసలు రహస్యాలు అనేకం వున్నట్లు స్పష్టమవుతోంది.

తెలంగాణలో పత్రికా, మీడియా సహా అనేక వ్యాపారాలు సాగిస్తూ తన వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరించిన రామోజీరావు కేసీఆర్ తో కేవలం తన వ్యక్తిగత వ్యవహారాలకు మాత్రమే పిలిపించుకున్నారని తెలుస్తోంది. తన భూములు, వ్యాఫారాలను పరిరక్షించుకోవడంలో ఓ అడుగు వెనక్కు వేసినా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వున్నంత వైరం కేసీఆర్ తో లేకపోవడంతో.. ముందడుగు వేశారని వ్యాపారవర్గాల టాక్. అయితే రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరి నుంచి అన్ని వ్యాపారాలకు కేసీఆర్ అండగా వుంటారన్న ధీమాతోనే ఆయనతో రామోజీరావు కలసినట్లు తెలుస్తుంది.

ఇదిలావుండగా, తెలంగాణలో రెండు వేల ఏకరాల్లో మరో ఫిల్మ్ సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే కేసీఆర్ ప్రకటించడం.. అంతలో ఇద్దరి మధ్య భేటీ జరగడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మంచ తలపెట్టిన ఫిల్మ్ సిటీని వాయిదా వేసుకోవాలని రామోజీ కేసీఆర్ కు విన్నవించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ సిటీ నిర్మాణం చేపడితే.. తాన ఫిల్మ్ సిటీకి ప్రేక్షకుల తాకిడి తక్కువతుందని, ఈ క్రమంలో వాయిదా వేసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒకవేళ ఫిల్మ్ సిటీ నిర్మించ తలపెడితే రంగారెడ్డి జిల్లాలో తన ఫిల్మ్ సిటీ పక్కనే నిర్మిస్తే ఉభయ కులశోపరిగా వుంటుందని కూడా రామోజీ కేసీఆర్ కు హితవు పలికారని సమాచారం.

అయితే అటు ఫిల్మ్ సిటీ వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీకి ధీటుగా వుండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రంగారెడ్డి జిల్లాలోని రాచకోండ గిరులపై కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు.  తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి సినిమా, క్రీడా నగరాలను నిర్మిస్తామని.. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో ఉన్న రాచకొండ గుట్టల ప్రాంతం ఇందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇక్కడ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశముందని చెప్పారు. హైదరాబాద్ నుంచి రాచకొండకు రెండు మార్గాల్లో నాలుగు లేన్ల రోడ్డును నిర్మిస్తామని చెప్పారు. ఈ మేరకు రాచకొండ గుట్టల ప్రాంతంపై సోమవారం మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో కలిసి సీఎం ఏరియల్ సర్వే చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles